grapping
-
ట్రంప్‌పై మరో వేధింపుల కేసు..మహిళ కీలక సాక్ష్యం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాష్ మనీ చెల్లింపుల కేసు విషయమై మాన్హాటన్ కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసందే. ఇప్పడూ తాజాగా ట్రంప్‌కి సంబంధించి.. 1970లలో తనను వేధింపులకు గురిచేశాడని ఓ రచయిత కోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు దాఖలు చేసింది రచయిత జీన్ కారోల్. ఈ మేరకు కారోల్ కేసు విషయమై జెస్సికా లీడ్స్ అనే మహిళ ట్రంప్ లైంగిక ప్రవర్తన గూర్చి కీలక సాక్ష్యం ఇచ్చింది. తాను విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడూ.. ట్రంప్ తనపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారో కోర్టులో వివరించింది. తనను ట్రంప్ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాకేందుకు యత్నించాడని కోర్టుకి తెలిపింది. అయితే లీడ్స్‌కు ప్రస్తుతం 81 ఏళ్లు. ఆమె 2016 ఎన్నికలకు వారాల ముందు న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్‌పై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తన గూర్చి ఆరోపణలు చేస్తూ డజనకు పైగా మహిళలు బయటకు రావడం జరిగింది. ఈ తాజా పిటిషన్ కూడా 1990 మధ్య కాలంలో ట్రంప్ లైంగిక వేధింపులు గూర్చి రచయిత 79 ఏళ్ల కారోల్ ఇటీవలే (గతేడాది) కేసు దాఖలు చేశారు. అప్పుడూ ట్రంప్ మాన్‌హట్టన్‌లోని లగ్జరీ బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్మెంట్ స్టోర్‌లో దుస్తులు మార్చుకునే గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. న్యూయార్క్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి..ఒక కొత్త చట్టం రావడంతో..కారోలో గతేడాది ఈ కేసును దాఖలు చేసింది. ఆ పిటిషన్లో కారోల్ 2019లో తొలిసారిగా ట్రంప్‌పై ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చానని, ఆ సమయంలో ట్రంప్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువు తీశారని వాపోయింది. అందువల్ల ట్రంప్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించకు కోవాలని పిటీషన్లో కోరింది. ఒకవేళ ఈ కేసులో ఓడిపోతే గనుకు తొలిసారిగా తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ చట్టపరంగా బాధ్యతవహించినట్లవుతుంది. మళ్లీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగి, వైట్‌హౌస్‌కి తిరిగి రావలనుకుంటున్న 76 ఏళ్ల ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక చట్టపరమైన సవాళ్లలో ఇదొకటి. అంతకమునుపు 2020 ఎన్నికల ఓటమిని తిప్పికొట్టే ప్రయంత్నంలో రహస్య పత్రాలను మిస్ చేయడం దగ్గర నుంచి 2021న తన మద్దతుదారులతో క్యాపిటల్‌పై దాడుల వరకు పలు విచారణలు ఎదుర్కొన్నాడు ట్రంప్. (చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..) -
క్రైస్తవ ఆస్తుల కబ్జాను సహించం
- న్యాయం జరిగే వరకు క్రైస్తవులకు అండగా ఉంటాం - స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం - ఎమ్మెల్యే ఐజయ్య హెచ్చరిక కర్నూలు(టౌన్): టీడీపీ పాలనలో క్రైస్తవ మత సంస్థల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఐజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కోల్స్ కళాశాల ఆస్తులను కబ్జా చేశారని, ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. క్రైస్తవ సంస్థల స్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోల్స్ కళాశాల వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారంనాటికి 6వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. క్త్రెస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రభుత్వంతోపాటు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. క్రయవిక్రయాలకు అనుమతి లేకున్నా అధికార పార్టీ నేతల అండతో ఆస్తులను కరిగించేస్తున్నారన్నారు. అన్యాయం జరిగిందని క్త్రెస్తవులంతా గగ్గోలు పెడుతున్నా అధికారపార్టీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ఐజయ్య ప్రశ్నించారు. దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుంటే క్రైస్తవులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన లేవదీస్తామని హెచ్చరించారు. పలువురి మద్దతు, పూర్వ విద్యార్థుల ర్యాలీ.. రిలే నిరహార దీక్షలు చేస్తున్న క్త్రెస్తవ సంఘాల నాయకులకు మద్దతుగా 1985 సంవత్సరానికి చెందిన కోల్స్ కాలేజీ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు దండు శేషుయాదవ్, దళిత న్యాయవాదుల సంఘం నాయకులు జయరాజు, బీసీ సంఘం జేఏసీ నాయకులు రవికుమార్, శ్రీరాములు, కోల్స్ చర్చి సంఘం అధ్యక్షులు లింకన్, అనిల్‌నాథ్, పాస్టర్లు విజయకుమార్, సజీవన్ తదితరులు దీక్షల్లో పాల్గొని మద్దతు తెలిపారు.