విమాన ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఒకప్పుడు విమానంలో స్మోకింగ్ అనేది.. డ్రింక్ చేసినంత ఈజీగా ఉండేదని, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోల ద్వారా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను గమనించినట్లయితే.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్ క్యాబిన్ ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విమానంలో స్మోకింగ్ కూడా చేసుకోవచ్చా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
బోర్డింగ్ పాస్‌లను గమనిస్తే.. లండన్ హీత్రూ నుంచి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్తున్న విమానంలో "నాన్-స్మోకింగ్ క్యాబిన్" అని ఉండటం చూడవచ్చు. ఒకప్పుడు విమానాల్లో కూడా స్మోకింగ్ చేసుకోవచ్చనే విషయం ఈ ఫోటోలు చూసేవరకు చాలామందికి తెలియకపోవచ్చు.
ఈ టికెట్స్ ఎప్పటివనే విషయం వెల్లడికాలేదు. కానీ ఇవి 1955 - 2009 మధ్య టికెట్స్ అయి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ టికెట్స్ మీద కనిపించే AFSL అనేది 'ఎయిర్ ఫ్రాన్స్ సర్వీసెస్ లిమిటెడ్' అని ఒకరు పేర్కొన్నారు. ఇవి 1996లో ప్రారంభమై 2009లో రద్దు చేశారు. ప్రస్తుతం విమానాల్లో స్మోకింగ్ నిషేదించారు.
Comments
Please login to add a commentAdd a comment