
మెక్సికో : హాలీడే ట్రిప్ వెళ్తున్న ఓ జంట తమ వెనుక సీట్లో జరిగిన తతంగాన్ని వీడియో తీసింది. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. విమానం చివరి సీట్లో కూర్చున్న జంట ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లుగా శృంగారంలో పాల్గొన్నారు. మెక్సికోకు వెళ్తుండగా విమానంలో జరిగిన ఈ తతంగాన్ని కీలీ టుల్లీ ట్విటర్‌లో పోస్ట్ చేయగా విషయం వెలుగుచూసింది.
కీలీ టుల్లీ పేరెంట్స్ మెక్సికోకు హాలీడే ట్రిప్‌కు మిలే మై క్లబ్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్తున్నారు. ఇంతలో వారి వెనుక కూర్చున్న వాళ్లు ముద్దులు పెట్టుకున్నట్లు గమనించారు. చివరి సీట్లలో కూర్చున్న మరో జంట తమ వ్యక్తిగత చర్యలను కానిచ్చేశారు. అయితే కీలీ టుల్లీ పేరెంట్స్ వెనుక జరుగుతున్న చర్యను తమ మొబైల్‌లో వీడియో తీశారు. మా అమ్మానాన్న టూర్ వెళ్తుంటే ఇలాంటి దృశ్యాన్ని చూడాల్సి వచ్చిందంటూ కిలీ టుల్లీ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన కొందరు.. ఎవరైనా మిలే హై క్లబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అంటూ కామెంట్ చేశారు. వాళ్లు అంత బరితెగించారా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment