
న్యూయార్క్: రష్యాకు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ అన్ని రకాల అంతర్జాతీయ విమానాలను ఈ నెల 8నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. బెలారస్‌కు మాత్రం తమ విమానాల రాకపోకలు సాగుతాయని తెలిపింది. విదేశీ విమానాలను అద్దెకు తీసుకునే రష్యా వైమానిక సంస్థలు ప్రయాణికుల, సరుకుల రవాణాను కొన్నాళ్లు నిలిపివేయాలని ఇటీవలే రష్యా విమానయాన నియంత్రణా సంస్థ రోసావైట్సియా సూచించింది.
రష్యాపై ఆంక్షలు విధించడంతో లీజుకిచ్చిన విదేశీ విమానాలను వెనక్కు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందుకనుగుణంగానే ఏరోఫ్లోట్ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి నగదు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే రష్యాకు చెందిన ఎస్7 సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment