దృశ్యంత్‌కుమార్‌ను అభినందిస్తున్న ఎంపీ డాక్టర్ సత్యవతి (ఇన్‌సెట్) దృశ్యంత్‌కుమార్
అనకాపల్లి: ఉగ్గినపాలెం గ్రామానికి చెందిన గాలి దృశ్యంత్‌కుమార్ బుడి బుడి అడుగుల నాడే అద్భుతమైన గ్రాహక శక్తితో నోబెల్ ప్రపంచ రికార్డు సాధించి అందరిని అబ్బుర పరిచాడు. తమిళనాడుకు చెందిన నోబెల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తండ్రి గాలి నాగేశ్వరరావు ఇక్కడ బుధవారం విలేకరులకు తెలిపారు. నాగేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారుడైన దృశ్యంత్ కుమార్ పుట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండడమే కాకుండా అపరిమితమైన గ్రాహక శక్తి ఉన్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు.
పది నెలల వయస్సు నుంచి కుమార్‌కు అనేక రకాల వస్తువులు, ఫొటోలు, వివిధ దేశాల జెండాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దృశ్యంత్ ఏడాది వయసులోనే 300 రకాల ఫొటోలను గుర్తించడమే కాకుండా వస్తువులు, పూలు, పండ్లు, కూరగాయలను సునాయాసంగా గుర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుని గ్రాహక శక్తిని వీడియో ద్వారా రికార్డు చేసి తమిళనాడులో ఉన్న నోబుల్ వరల్డ్ రికార్‌ుడ్స ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు ఇటీవల పంపించారు. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఉగ్గినపాలెం వచ్చి పరిశీలించిన మీదట నోబెల్ వరల్డ్ రికార్డులో నమోదు చేసి పురస్కారాన్ని ప్రకటించారు. సర్టిఫికెట్, పతకాన్ని అందిస్తూ పోస్టు ద్వారా ఇక్కడకు పంపారు. దీంతో పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఎంపీ డాక్టర్ సత్యవతి అభినందన
చిన్నతనంలోనే అద్భుతాలు చేస్తున్న దృశ్యంత్‌కుమార్‌కు అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి తన కార్యాలయంలో బుధవారం జ్ఞాపికను అందజేసి సత్కరించి కొద్దిసేపు ముచ్చటించి అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కూడా సత్కరించారు. ఈ చిన్నారి మరిన్ని అద్బుతాలు సాధించి అందరికి ఆదర్శంగా నిలవగలడని ఆకాంక్షించారు. డాక్టర్ కె. విష్ణుమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment