600 కేజీల గంజాయి స్వాధీనం
విలువ సుమారు రూ.30 లక్షలు
పాయకరావుపేట: గోపాలపట్నం గ్రామం సూదికొండ శివారులో 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. సరకు విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని చెప్పారు. పాయకరావుపేట పోలీసు స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూదికొండ సమీపాన గంజాయి నిల్వ ఉందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది ప్రదేశానికి చేరుకొని, 19 గోనె సంచుల్లో ఉన్న 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మండలంలో గల గుంటపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఏజెన్సీ నుంచి గంజాయిని తెప్పించి ఇతర రాష్ట్రాలకు అమ్ముతాడని, ఈ క్రమంలోనే ఒడిశా ప్రాంతంలో ఒక గ్రామం నుండి జీకే వీధి మండలం మొండిగడ్డకు చెందిన వ్యక్తితో ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని చెప్పారు. సుమారు 600 కేజీల గంజాయిని మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో సేకరించి.. వ్యాన్‌లో ఇద్దరు డ్రైవింగ్ చేసుకుంటూ, మరో ఇద్దరు పల్సర్ బైక్‌పై వారి ముందు పైలెట్ చేసుకుంటూ సీలేరు నుంచి పాయకరావుపేట తీసుకువచ్చా రు. ప్రధాన నిందితుడు గతంలో తనకు జైలులో పరిచయమైన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో బేరం కుదుర్చుకుని అమ్ముతుంటాడని, ఈ క్రమంలోనే చెన్నెకి చెందిన బాస్ అనే వ్యక్తికి సుమారు 145 కేజీల గంజాయి సరఫరా చేయడం కోసం గుంటపల్లికి చెందిన వ్యక్తి అడ్వాన్స్ తీసుకుని పంపించడానికి సన్నాహాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపా రు. పట్టుబడిన ఐదుగురు వ్యక్తుల సమాచారం మేర కు, మరో ముగ్గురు వ్యక్తులను పిఎల్ పురం వద్ద అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయిని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సీఐ జి.అప్పన్న, ఎస్‌ఐ పురుషోత్తం, హెచ్‌సీ శ్రీనివాసరావు, పీసీ సతీష్, సూరిబాబులకు, హోంగార్డ్ మదీనాకు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసా పత్రాలను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment