ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
● సర్వే నెంబర్లు మార్చి రియల్టర్ పేరున 2.91 ఎకరాల అసైన్డ్ భూమికి మ్యుటేషన్ ● రూ.10 కోట్ల విలువైన భూమినిసిమెంట్ కంపెనీ పేర రిజిస్ట్రేషన్ చేసిన రియల్టర్ ● కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమితోపాటు చెరువు, శ్మశానాల ఆక్రమణ ● పూర్వ తహసీల్దార్ అండతో యథేచ్ఛగా అక్రమాలు ● గతంలో సిట్‌కు, ప్రస్తుతం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం ● ఏడేళ్లుగా ప్రభుత్వ భూమినికాపాడేందుకు సామాన్య రైతు పోరాటం ● వ్యవహారమంతా అప్పటి టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలోనే
ఉత్సాహంగా క్రీడా పోటీలు
నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యంలో నర్సీపట్నంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి.
అంకుడు మొక్కల పెంపకం
ఏటికొప్పాక బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుడు మొక్కల పెంపకం చేపడుతోందని డ్వామా పీడీ చెప్పారు.
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
రేగుపాలెంలో ఆక్రమణకు గురైన
ఎర్రచెరువు చుట్టూ నిర్మించిన ప్రహరీ
‘కూటమి’ అధికారంలోకి వచ్చాకే రిజిస్ట్రేషన్
ఏడేళ్లుగా ప్రభుత్వ భూమి కోసం పోరాడుతున్నాను. 2017లో సిట్‌కు, 2024 అక్టోబర్‌లో జిల్లా కలెక్టర్‌కూ ఇక్కడ జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేశాను. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పటి తహసీల్దార్ ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్పు చేశారు. అప్పటివరకూ హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని చెబుతూ కాలయాపన చేసి 2024 జూలై 31న 2.91 ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ జరిగేలా తహసీల్దార్ సహకరించారు. ఎర్రచెరువు, శ్మశాన వాటిక కూడా ఆక్రమించి ప్రహరీ గోడ కడుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. కూటమి ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు సహకరిస్తోంది. ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనపర్చుకోవాలి.
– రెడ్డి రమణ, రైతు రేగుపాలెం
సిమెంటు కంపెనీకినోటీసులిచ్చాం
రేగుపాలెం సర్వే నెంబర్లు 164,1 65లో చెరువు, శ్మశాన వాటికను ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మిస్తున్న సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులిచ్చాం. ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడ తొలగించాలని చెప్పాం. సర్వే నెంబర్లు 167/4, 167/5లో ఉన్న భూమి పొరపాటుగా జిరాయితీగా నమోదు కావడం వలన రిజిస్ట్రేషన్ జరిగింది. దీనిపై రేగుపాలేనికి చెందిన రెడ్డి రమణ జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై పరిశీలన జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది.
– కె.వరహాలు, తహసీల్దార్,
యలమంచిలి
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామం సర్వే నెంబరు 167/1లో 4.20 ఎకరాలు, సర్వే నెంబరు 167/3లో 4.74 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ అనాధీనం భూమిగా నమోదై ఉంది. 2004లో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణం కోసం సర్వే నెంబరు 167/1లో 1.95 ఎకరాలు, సర్వే నెంబరు 167/3లో 4.08 ఎకరాల భూమిని కేటాయించారు. సర్వే నెంబరు 167/1లో మిగిలిన 2.25 ఎకరాల భూమిని సర్వే నెంబరు 167/4గా, సర్వే నెంబరు 167/3లో 0.66 ఎకరాల మిగులు భూమిని సర్వే నెంబరు 167/5తో మార్చి 2014–2017 మధ్య అప్పటి యలమంచిలి తహసీల్దార్ అసైన్డ్ భూమిగా నమోదు చేశారు. ఆ ప్రాంతంలో రియల్టర్ శాఖమూరి శ్రీనివాసరావు సుమారు 20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ అనాధీన భూములపై కూడా కన్నేసిన ఆ రియల్టర్ నుంచి భారీగా ముడుపులు ముట్టడంతో ప్రభుత్వ భూమిని అతని పేర రెవెన్యూ రికార్డుల్లో (1బీలో) డీ పట్టా భూమిగా తొలుత నమోదు చేశారు. ఇందుకోసం మాన్యువల్‌గా రాసిన రెండు నకిలీ పాసు పుస్తకాలు కూడా సృష్టించారు. 20 ఎకరాలు కొనుగోలు చేసిన ధనవంతుడైన భూస్వామి పేర డీ పట్టాగా నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. 2017 జూన్ 7న ఈ వ్యవహారంపై రేగుపాలెం గ్రామానికి చెందిన రైతు రెడ్డి రమణ అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న సమయంలో అప్పటి తహసీల్దారు సహకారంతో రియల్టర్ శాఖమూరి శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేసి సిట్ విచారణపై స్టే తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆ వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆనాటి తహసీల్దారే బదిలీపై వచ్చారు. రేగుపాలెం సర్వే నెంబరు 167/4, 167/5లో ఉన్న 2.91 ఎకరాల అనాధీనం భూమికి రీసర్వే చేయించి ఎల్‌పీఎం నెంబర్లు 5240, 5242 కేటాయించి జిరాయితీ భూమిగా రియల్టర్ శాఖమూరి శ్రీనివాసరావు పేరున మ్యుటేషన్ చేశారు. గతేడాది జూలై 31న ఆ భూమిని శాఖమూరి శ్రీనివాసరావు ఓ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి యలమంచిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజు నెంబరు 9034/2024తో క్రయం చేశాడు. ఈ వ్యవహారంలో అప్పటి రెవెన్యూ అధికారులకు భారీగా సొమ్ము ముట్టడం వల్లనే రియల్టర్‌కు అనుకూలంగా రికార్డు లు తారుమారు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనికి బాధ్యులైన తహసీల్దార్, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతు రెడ్డి రమణ అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. విచారణలో అక్రమాలు వాస్తవమేనని తేలినా ఉన్నతాధికారులు ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చెరువు, శ్మశానం ఆక్రమణ..
అనుమతి లేకుండా ప్రహరీ నిర్మాణం
ఇక్కడ భూమిని కొనుగోలు చేసిన సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం మరింత బరితెగింపునకు దిగింది. కొనుగోలు చేసిన భూములతోపాటు పక్కనే సర్వే నెంబరు 165లో 4.68 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర చెరువు, సర్వే నెంబరు 164లో ఉన్న శ్మశాన వాటికను ఆక్రమించుకోవడానికి స్కెచ్ వేసింది. చెరువు గట్టును చదును చేసి శ్మశాన వాటిక స్థలాన్ని కొంతమేర ఆక్రమించి సుమారు 15 అడుగుల ఎత్తులో భారీ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తోంది. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయితే ఎర్రచెరువు ఆయకట్టు భూములకు సాగునీరందడం ప్రశ్నార్థకమేనని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏపీ ల్యాండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 1905 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, తమ కళ్లముందే ఆక్రమణలు కనిపిస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు సిమెంటు పరిశ్రమ యాజమాన్యం చేపడుతున్న భారీ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. అయినా పంచాయతీ అధికారులెవరూ నోరు మెదపడం లేదు.
25న షాలిమర్– విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు
తాటిచెట్లపాలెం (విశాఖ): నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ నెల 25న సంత్రగచ్చి–చైన్నె సెంట్రల్(22807) ఎక్స్‌ప్రెస్, షాలిమర్–విశాఖపట్నం(22853) ఎక్స్‌ప్రెస్, 26న విశాఖపట్నం–షాలిమర్(22854) ఎక్స్‌ప్రెస్, 27న చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి (22808) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని సూచించారు.
అక్రమాలు నిర్థారిస్తూ నివేదిక
రైతు రెడ్డి రమణ జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ప్రస్తుత తహసీల్దార్ కె.వరహాలు అక్రమాలను నిర్థారిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. రేగుపాలెం గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూములను జిరాయితీగా రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్‌కు సహకరించడం, చెరువు, శ్మశాన వాటిక ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మాణం వంటివి విచారణలో నిరూపితమయ్యాయి. సుమారు మూడు నెలలు గడుస్తున్నా నేటికీ దీనిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో జిల్లా ఉన్నతాధికారులే చెప్పాల్సి ఉంది. చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదుదారునితో అధికార యంత్రాంగం అమర్యాదగా ప్రవర్తిస్తూ తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు.
ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
ప్రభుత్వ భూమిని రాసిచ్చారు..
Comments
Please login to add a commentAdd a comment