Impaired
-
ఐఐఎం పరీక్షల్లో అంధురాలి ప్రతిభ
కనుచూపు లేక ముసిరిన చీకటిలో పట్టుదల కాంతిపుంజమై దారి చూపింది. రెప్పల మాటున దాగున్న కలలను చదువుతో సాకారం చేసుకుంది.అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ.ఐ.ఎం. (ఇండియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి దేశంలోని 21 ఐ.ఐ.ఎం. కళాశాలల్లోని 19 కళాశాలల్లో అర్హత సాధించింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలాలకు చెందిన కొత్తకాపు శివాని భవిష్యత్తుకు నిర్మించుకుంటున్న సోపానాలను ఇలా మన ముందుంచింది.‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు కొత్తకాపు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డిలకు రెండోసంతానాన్ని. మా అక్క కీర్తన గ్రూప్ 4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. మా చెల్లి భవానికి 80 శాతం చూపులేదు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంబీఏ సీటును సాధించింది. నాకు పుట్టుకతోనే చూపు లేదు. అయినా, చదువంటే మాకెంతో ఆసక్తి. అదే మమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని మా నమ్మకం. జహీరాబాద్‌లోని శ్రీ సరస్వతీ శిశుమందిరంలో నా ప్రైమరీ చదువు ఆరంభమైంది. కానీ, చూపు లేక΄ోవడంతో చాలా ఇబ్బంది పడేదాన్ని. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నలు హైదరాబాద్‌లోని బేగంపేటలో గల దేవనార్ పబ్లిక్ స్కూల్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు అదే బడిలో చదువుకున్నాను. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్మీడియెట్‌ను జహీరాబాద్‌లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్‌తో పూర్తి చేశాను. కాలేజీలో క్లాసులను విని, సహాయకులతో పరీక్షలు రాశాను. ఆ రెండేళ్లూ కాలేజీ టాపర్‌గా నిలిచాను.ఉన్నతస్థాయి ఉద్యోగమే లక్ష్యంచెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి బీబీఏ కోర్సు పూర్తి చేశాను. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆ¯Œ ౖలñ న్లో కోచింగ్ తీసుకున్నాను. 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసి 93.51 శాతం మార్కులతో దేశంలోని 21 ఐఐఎం కళాశాలల్లోని 19 కళాశాలల్లో ప్రవేశార్హత సాధించాను. వాటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఐఐఎంను ఎంపిక చేసుకున్నాను. కిందటి నెల 23న కళాశాలలో చేరాను.శక్తినిచ్చే గీతోపదేశం చూపు లేక΄ోవడంతో చదువు కష్టంగా ఉండేది. బ్రెయిలీ లిపి నేర్చుకునేంతవరకు చదువు పట్ల నాకున్న తపనను ఎలా తీర్చుకోవాలో తెలిసేది కాదు. అంధుల పాఠశాలలో చేరాక నాకు పెద్ద అండ దొరికినట్టుగా అనిపించింది. కార్పొరేట్ కంపెనీలలో టాప్ లెవల్ ఉద్యోగం చేయాలని ఉంది. అందుకు తగిన అర్హతలు సం΄ాదించుకోవడానికి స్పెషలైజేషన్ కూడా చేస్తాను. శ్రీకృష్ణుడి గీతోపదేశం వింటూ ఉంటాను. జీవితంలోని ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలో గీత ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. రెండు సంవత్సరాల ఐఐఎం కోర్సును విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్నలకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలన్నదే నా ఆకాంక్ష’’ అని చెప్పింది శివాని. – యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి, సాక్షి, జహీరాబాద్ఎంతో గర్వంగా ఉందిమా అమ్మాయి శివానీ జాతీయ స్థాయిలో ఐఎంఎ సీటును సాధించడం మాకెంతో గర్వంగా ఉంది. ఆమె పుట్టుగుడ్డిగా పుట్టినప్పుడు కొంత బాధపడ్డాం. కొందరు మనసు నొప్పించే మాటలు అనేవారు. కానీ, వాటిని పట్టించుకోకుండా అమ్మాయిలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో కష్టపడి చదివించాం. ఇప్పుడు శివానీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, గో΄ాల్రెడ్డి -
చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ' ఇచ్చే శక్తిగా..!
భవిష్యత్తుకు ప్రేరణ ‘మీ కూతురు ఇక నడవలేదు. వినలేదు’ అంటూ వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాట విన్న తరువాత ఉజ్వల, ఆమె భర్త తమ జీవితాలను అర్ధంతరంగా చాలించాలనుకున్నారు. నిరాశే తప్ప ఆశ కనిపించని ఆ కఠిన సమయంలో హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదివిన ఉజ్వల ఆత్మస్థైర్యం తెచ్చుకొని, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంది. కూతురికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది... ఆ రోజులు ఎలాంటివి అంటే... పాప నవ్విన ప్రతిక్షణం ఆ దంపతులకు పండగే. అలాంటి ఆనందమయ రోజుల్లో ఆరు నెలల పాప ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదం వల్ల పాప పక్షవాతానికి గురైంది. వినికిడి శక్తి కోల్పోయింది. ‘పాప ఇక ఎప్పటికీ నడవలేదు’ అన్నట్లుగా చెప్పాడు డాక్టర్. ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ‘ఆత్మహత్య తప్ప మన జీవితానికి మరో పరిష్కారం లేదు’ అనుకున్నారు ఉజ్వల, ఆమె భర్త. ఆ సమయంలో ఒకరోజు తన సోదరి దగ్గర మనసులోని బాధను బయట పెట్టింది ఉజ్వల. సోదరి ఏం మాట్లాకుండా హెలెన్ కెల్లర్ ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ చేతిలో పెట్టి ‘ఇది ఒకసారి చదువు... ఇంతకుమించి ఏమీ చెప్పను’ అన్నది. ‘ప్రతి నిమిషం నిరాశే’ లాంటి ఆ రోజుల్లో ఒకరోజు ఉజ్వల హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదవడం మొదలుపెట్టింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘గుడ్ ఇంగ్లీష్’పై హెలెన్ పట్టుసాధించిన విధానం నుంచి జీవితంలోని నిరాశామయ సమయాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్లడం వరకు ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. నయాగరా జలపాతం దగ్గర ఉన్నప్పుడు ఆ జలపాతం అందాలను హెలెన్ మనోనేత్రంతోనే చూసిన విధానం అపురూపంగా అనిపించింది. ఆ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరువాత తన మనసులో కమ్మిన నిరాశ మేఘాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ‘నా బిడ్డ కనీసం చూడగలుగుతుంది కదా’ అనుకుంది ఉజ్వల. తనలో సానుకూల శక్తికి అక్కడే బీజం పడింది. ‘ప్రియాంక’గా ఉన్న పాప పేరును ‘ప్రేరణ’ గా మార్చింది. మార్పు మొదలైంది. అది ఆశావహమైన మార్పు. మరోవైపు... నడవడం కష్టం అనుకున్న పాప వైద్యం, వ్యాయామాల వల్ల నడవడం ప్రారంభించింది. అయితే వినికిడి లోపం మాత్రం పోలేదు. ప్రేరణను స్పీచ్ అండ్ హియరింగ్–ఇంపేర్డ్ స్కూలులో చేర్పించింది. ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించి పుణెలోని ‘సాధన నృత్యాలయ’లో చేర్పించింది ఉజ్వల. ‘నృత్యాలయలో చేర్పించిన మాటేగానీ ప్రేరణ ఎలా డ్యాన్స్ చేయగలుగుతుంది? గురూజీ చెప్పే ముద్రలను ఎలా అర్థం చేసుకోగలదు... ఇలాంటి సందేహాలెన్నో నాలో ఉండేవి. అయితే గురూజీ షమిత మహాజన్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రేరణను ఎలాగైనా మంచి నృత్యకారిణిగా తయారు చేయాలనే పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది’ అంటుంది ఉజ్వల. శమిత మహాజన్ దగ్గర నృత్యంలో పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ. మొదటి రెండు సంవత్సరాలు బాగానే కష్టపడాల్సి వచ్చింది ప్రేరణ. ‘మాటల ద్వారా ప్రేరణకు నాట్యానికి సంబంధించిన ముద్రలను నేర్పించడం కష్టం. చాలా ఓపిక ఉండాలి. గురూజీ ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. గురూజీ చెప్పేదాన్ని లిప్–రీడింగ్ ద్వారా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఉజ్వల. ఎంతోమంది సీనియర్ డ్యాన్సర్ల ముందు ప్రేరణ ఆరంగేట్రం ఇచ్చింది. సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు. ‘నాట్యకారిణిగా నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది’ అని పెద్దలు ప్రేరణను ఆశీర్పదించారు.‘చీకటిగా ఉన్న నా ఆత్మగదుల్లోకి ఒక కాంతికిరణం ప్రసరిస్తే ఎలా ఉంటుంది?’ అని తన ఆత్మకథ చివరిలో ప్రశ్నిస్తుంది హెలెన్ కెల్లర్. అది అచ్చంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్న అపూర్వ విజయంలా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రేరణ. ఒక ద్వారం మన కోసం... బాధ, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరుచుకొనే ఉంటుంది. ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేము. – ఉజ్వల సహానే (చదవండి: ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్ !) -
'వీడియో కాలింగ్ వారికోసమే పెట్టారేమో'
ముంబయి: మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన ట్విటర్‌ను పరిశీలిస్తే మన హృదయాలను కదిలించే ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడం గమనిస్తుంటాం. తాజాగా ఆయన ఇలాంటిదే ఒక వీడియోనూ ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో.. ఒక వ్యక్తి స్వీట్‌షాప్ ముందు కూర్చుని తన ఫోన్లో వీడియో కాలింగ్ చేసి సీరియస్‌గా అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇందులో విషయం ఏముందిలే అని కొట్టి పారేయకండి. ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి మూగవాడు అవడంతో అవతలి వ్యక్తితో కేవలం తన సంజ్ఞల ద్వారా విషయం మొత్తం చెప్పడం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. అంతే నిమిషం ఆలస్యం చేయకుండా వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. 'ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది ప్రపంచాన్ని మింగేస్తుందని అందరూ విమర్శిస్తున్నారు. కానీ అదే మొబైల్ సరికొత్త టెక్నాలజీతో ఇవాళ మనకు ఒక కొత్త భాషను ప్రపంచానికి పరిచయం చేసిందని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నా. ఒక మాటలు రాని వ్యక్తి తన సైగలతోనే అవతలి వ్యక్తికి సమాచారం చేరవేయడం నాకు కొత్తగా అనిపించింది. బహుశా మూగవారందరు మాట్లాడుకునేందుకే మొబైల్ఫోన్లో వీడియో కాలింగ్ ఆప్షన్‌ను ఏర్పాటు చేసి ఉండొచ్చని' మహీంద్రా భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవడంతో పాటు మహీంద్రా పెట్టిన కామెంట్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. We often criticise the way in which mobile devices have taken over our world.. It’s good to remind ourselves that these devices have also OPENED up a whole new world of communication for many of us... pic.twitter.com/kricI2dNeG — anand mahindra (@anandmahindra) December 27, 2019 -
వారికి.. మెట్రో సౌకర్యాలపై అవగాహన!
బెంగళూరుః దృశ్య, శ్రవణ లోపాలున్న ఓ బృదం మొదటిసారి మెట్రో రైల్లో ప్రయాణించి తమ అనుభవాలను తెలిపింది. ఓ ఎన్జీవో సంస్థతో పాటు ఐటీ సంస్థ సాయంతో వారు 'నమ్మ మెట్రోస్' అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ లో ప్రయాణించారు. లోపాలున్న వ్యక్తులకు మెట్రోలో కల్పించే ప్రత్యేక సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు సైన్స్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రత్యేక రైడ్ నిర్వహించింది. దృష్టి, వినికిడి లోపాలున్నవారికి మెట్రో రైల్లో ప్రయాణ సౌకర్యాలపై మొదటిసారి ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. లోపాలున్న 34 మంది తోపాటు వారి సహాయకులు సైన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ప్రత్యేక రైడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైడ్ లో కాగ్నిజెంట్ నుంచి 13 మంది వాలంటీర్లు సైతం భాగం పంచుకున్నారు. భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు చెందిన పలువురు ఈ రైడ్ లో పాల్గొని మెట్రో రైల్లో తమకు ప్రత్యేకంగా కల్పించిన సౌకర్యాలపై అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. బెంగళూరులోని స్వామీ వివేకానంద మెట్రో స్టేషన్ నుంచి కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వరకూ వారి ప్రయాణం సాగింది. ఇంద్రియ సంబంధమైన వైకల్యాలతో బాధపడుతున్న వారికి జాతీయ శిక్షణలో భాగంగా ఈ ప్రత్యేక రైడ్ నిర్వహించినట్లు సైన్స్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా మైట్రో రైళ్ళలో వికలాంగులకు అనుకూలంగా అందించే ప్రత్యేక సౌకర్యాలను వారికి వివరించినట్లు తెలిపారు. -
ఫీజుల్లేని పాఠశాల..!
అంధ, బదిర పిల్లల అభివృద్ధే ధ్యేయంగా, సమాజంలో వారికి మంచి గుర్తింపు రావాలన్నదే ఆశయంగా ఓ పాఠశాల పాటుపడుతోంది. వ్యక్తిగత అనుభవాలను రంగరించి విద్యాబోధనకు జోడించి వారి భవితకు సహకరిస్తోంది. పరీక్షలు మార్కులే ధ్యేయంగా పోటీ తత్తంలో నిర్వహిస్తున్న పాఠశాలలున్న నేటి తరుణంలో... ఇబ్బడి ముబ్బడి ప్రవేశాలకు దూరంగా... ఒక్క రూపాయి కూడ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఆ విద్యాలయం కొనసాగుతోంది. 1998 లో ఆచార్య రకుమ్ స్థాపించిన ఆ సంస్థ.. నేడు ఎంతోమంది పౌరులను దేశానికి అందిస్తోంది. ఆచార్య శ్రీ రకుమ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్... బెంగళూరులో 1998 లో స్థాపించి ప్రస్తుతం మూడు శాఖలను నిర్వహిస్తోంది. ఎటువంటి ప్రభుత్వ, విదేశీ సంస్థలనుంచీ ఆర్థిక సాయం ఆశించకుండా... పిల్లలకు ఉచిత శిక్షణతోపాటు, ఆహారం, దుస్తులు, వృత్తి శిక్షణ అందిస్తోంది. ప్రజల సహాయ సహకారాలతో విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా సాకుతోంది. ప్రస్తుతం ఆరు వందలమంది విద్యార్థులతో ఆ విద్యాలయం దిన దిన ప్రవర్థమానమౌతోంది. మారు మూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలనుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ చేరుతుంటారు. ఎటువంటి ఆర్థిక సాయం లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో ప్రతిరోజూ తమకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, పాలు వంటి వస్తువుల జాబితాను విద్యార్థులు బ్లాక్ బోర్డ్ పై రాసి బయట పెడతారు. స్థానిక ప్రజలు, దయ కలిగిన వారు బోర్డును చూసి స్పందించి వారికి తోచిన సహాయం అందిస్తుంటారు. మిగిలిన అవసరాలు మాత్రం పిల్లల జీవిత పోరాటంలో భాగమేనని నిర్వాహకుడు రకుమ్ చెప్తారు. 1988 లో రికార్డు నెలకొల్పిన కరాటే ఛాంపియన్ రకుమ్. పలురకాల విద్యల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆయన... జపనీస్ సహా పలు భాషల్లో మాట్లాడగలడు. నేచురోపతి వైద్యంలో కూడ ప్రావీణ్యం కలిగిన వాడు. విద్యార్థులను ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నంతోపాటు, వారికి మార్షల్ ఆర్ట్స్ లో కూడ తర్ఫీదునిస్తున్నారు. సెలవుదినాల్లో వంట, కార్పెంటరీ, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ రిపేర్లు నేర్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి దాటిన పిల్లలకు సైక్లింగ్, డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. జీవితంలో వారు ఏ పరిస్థితిలోనైనా ధీమాగా బతకగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠశాల వయసునుంచే వారికి అందిస్తున్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలో ఎంతోమంది యోగాలో ప్రావీణ్యం పొంది, కరాటేలో బ్లాక్ బెల్ట్ పొంది ప్రపంచంలో ఎక్కడైనా తమ విద్యను వినియోగించుకునే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివిన పిల్లలు సివిల్ సర్వెంట్స్ అవ్వాలన్నది పాఠశాల నిర్వాహకుడు రకుమ్ ఆకాంక్ష. అందుకే విద్యార్థులకు ఆరోక్లాసునుంచే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడ రాశారు. అయితే ఈ పాఠశాలలో ఇటీవల పిల్లల అవసరాలు తీరడం కొంత కష్టంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బోర్డుపై తమ అవసరాలను రాసే విద్యార్థులు, ఇప్పడు ఫేస్ బుక్ పేజీల్లో కూడ పెడుతున్నారు. దీనికి స్పందించి అందించిన సహాయంతో కాలం గడుపుతున్నారు. ఇటువంటి పిల్లల బాధ్యత తన ఒక్కడిదే కాదని, సమాజానికి కూడ బాధ్యత ఉందని రకుమ్ అంటున్నారు. అయితేనేం అనుకున్నది సాధించేందుకు రకుమ్ పాటు పడుతున్నారు. దయగలవారెవరైనా ఇటువంటి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని సూచిస్తున్నారు.