assurance
-
తిరుపతి తొక్కిసలాట బాధితులను స్విమ్స్ లో పరామర్శించిన జగన్
-
మా ప్రతి సైనికుడికీ అండగా నిలుస్తా... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
YSRCP కార్యకర్తకు YS జగన్ భరోసా
-
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆంధ్రప్రదేశ్‌లో తుపానుతో దెబ్బతిన్న జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నగదు, నిత్యావసర సరకులతో ఆదుకుంటామని బాధితులకు భరోసా..ఇంకా ఇతర అప్డేట్స్
-
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
-
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
పోలవరం ముంపు బాధితులకు సీఎం జగన్ భరోసా
-
పేరెంటింగ్: భయం కాదు... భరోసా పెరగాలి
ఆదివారం పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్లారు సంగీత దంపతులు. లోపలికి అడుగుపెట్టగానే పార్కులో ఎత్తైన గోడ అడ్వెంచర్వాల్ మీదనే పడింది పిల్లల దృష్టి. పోటీ పడి పరుగందుకున్నారిద్దరూ. ఎవరు ముందు గోడ దగ్గరకు వెళ్తారో అనేది ఒక పోటీ. ఎవరు ముందు గోడ ఎక్కుతారోననేది మరో పోటీ. వాళ్ల పరుగును అందుకోలేక, పరుగెత్తి వెళ్లకుండా ఉండలేక ఆయాసపడుతున్నారు తల్లిదండ్రులు. గోడ ఎక్కే ప్రయత్నంలో పిల్లలు కింద పడతారేమోననే భయం. వారి ఆందోళనను ఆపుకోలేక వెనుక నుంచి ‘పడిపోతారు, జాగ్రత్త’ అని పిల్లలకు వినిపించేటట్లు పెద్దగా అరుస్తున్నారు. ఈ ఆందోళననే వద్దంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లలకు చెప్పాల్సింది ‘పడిపోతారు, జాగ్రత్త’ అని కాదు. ‘జాగ్రత్తగా ఎక్కండి, కింద మేమున్నాం’ అని భరోసానివ్వాలంటున్నారు. పిల్లలకు నీళ్లు కనిపిస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. చెట్టు కనిపిస్తే చిటారు కొమ్మకు వేళ్లాడే వరకు మనసు ఊరుకోదు. అనుక్షణం పిల్లలను ఓ కంట కాచుకుంటూ ఉండడం మంచిదే, కానీ అడుగడుగునా వాళ్ల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం మాత్రం మంచిదికాదు. పిల్లలకు భయం తెలియదు, పెద్దవాళ్లు తమ భయాన్ని పిల్లల మెదళ్లలోకి రవాణా చేస్తారు. ఇది పిల్లల మెదళ్లలో ఇంకిపోతుంది. ఫలితంగా తమ మీద తమకు నమ్మకం నశిస్తుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇదే గుర్తు పిల్లల మాటల్ని జాగ్రత్తగా వినాలంటారు సైకాలజిస్ట్ సుదర్శిని. ‘అమ్మా ఆ చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ గోడ వెనుక ఏముంటుంది’ అని వాళ్ల నోటి వెంట వచ్చిందీ అంటే... అంతకంటే ముందు ఆ ఆలోచన వాళ్ల మెదడులో పుట్టిందనే కదా అర్థం. చెట్టు పై కొమ్మ మీదకు వెళ్తే జరిగే ప్రమాదాన్ని వివరించాలి. చెట్టు మీద ఎంతవరకు వెళ్లడం క్షేమకరమో చెప్పి, వాళ్లను చెట్టు ఎక్కమని, ‘నీ భద్రత కోసం కింద మేముంటాం’ అని చెప్పాలి. చెట్టు ఎక్కడం నేర్పించడమే కరెక్ట్. అంతే తప్ప, పిల్లలకు తమ కళ్లతో ప్రపంచాన్ని చూపిస్తూ, తమ కాళ్లతో నడిపిస్తూ పెంచడం సరైన పెంపకం కాదంటారామె. పిల్లలు తమ ప్రయత్నంతో కిందపడిపోతే చేయి అందించి లేపడమే బెస్ట్ పేరెంటింగ్. పడకుండా పెంచాలనుకోకూడదు. పిల్లలు తమ తొలి ప్రయత్నంలో సక్సెస్ కాకపోతే మరో ప్రయత్నం చేయడానికి ప్రోత్సహించాలి. అంతేకానీ ‘నీ వల్ల కాదులే, ఇక మానుకో’ అని నిరుత్సాహపరచకూడదు. ఏ తీరున పెంచుతున్నాం? ‘‘ఒక తరంలో... యాభై ఏళ్ల కిందట దాదాపుగా అన్ని ఇళ్లలోనూ అథారిటేరియన్ పేరెంటింగ్ ఉండేది. ఒకరకంగా అది నియంతృత్వమే. ‘మేము తల్లిదండ్రులం. మేము నిర్ణయిస్తాం. పిల్లలు అనుసరించి తీరాల్సిందే. అదే క్రమశిక్షణ’ అనుకునేవాళ్లు. పాతికేళ్ల కిందట పరిస్థితి పూర్తిగా పెర్మిసివ్గా మారిపోయింది. అంటే... పిల్లలు దేనికీ నొచ్చుకోకూడదన్నట్లు వాళ్లు అడిగీ అడగక ముందే అన్నీ అమర్చడం. అవసరం ఉన్నాలేకపోయినా అడిగినవన్నీ కొనిచ్చి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా గడచిన తరంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొన్న వాళ్లు ఈ తరంలో తమ పిల్లలకు అవసరానికి మించి అన్నీ సమకూర్చేయడం, తమకు దక్కని సంతోషాలన్నీ పిల్లలకు మిక్కిలిగా అందాలని తాపత్రయపడడం ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఇది మంచి ఫలితాలనివ్వదు. అలాగే నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనేది ఫలానా రోజుల్లో అని కాదు, అప్పుడూ ఇప్పుడూ కూడా కనిపిస్తోంది. పిల్లల్ని గాలికి వదిలినట్లే ఉంటుంది తల్లిదండ్రుల తీరు. ఇది ఏ మాత్రం స్వాగతించలేని పేరెంటింగ్ అన్నమాట. ఇక అందరూ అంగీకరించి తీరాల్సిన పేరెంటింగ్ స్టైల్స్‌లో ఒకటి ‘అథారిటేటివ్ పేరెంటింగ్’ మాత్రమే. ఇందులో తల్లిదండ్రులు నిర్ణయాధికారులుగా ఉండరు. పేరెంట్స్– పిల్లలు సమానమే. ఇరువురూ ఒకరి అభిప్రాయాలను మరొకరు వినాలి. పరస్పరం చర్చించుకుని, మంచిచెడులు విశ్లేషించుకుని తుది నిర్ణయం మీద ఒక అంగీకారానికి రావాలని చెప్తుంది ఈ థియరీ. పిల్లలకు కొన్ని పరిమితమైన లిమిట్స్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్లకూ బాధ్యతల పరిధులతో కూడిన పేరెంటింగ్ ఇది. ఇక పిల్లల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్‌ని గుర్తించి అందులో శిక్షణ ఇప్పించి, కరెక్ట్‌గా చానలైజ్ చేసి పిల్లలను తీర్చిదిద్దడం అత్యున్నతమైన పేరెంటింగ్. దీనినే ‘పాజిటివ్ పేరెంటింగ్’ అంటారు. అథారిటేటివ్, పాజిటివ్ పేరెంటింగ్లు రెండూ అనుసరించాల్సిన పద్ధతులే అని, పిల్లల పెంపకంలో అవలంబించాల్సిన పద్దతిని వివరించారు సైకాలజిస్ట్. ఇది ఓ కళ పిల్లల్ని పెంచడం అనేది అద్భుతమైన కళ. మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించవచ్చు అనే అవకాశం ఇందులో ఉండదు. ఉన్నది ఒక్కటే జీవితం అన్నట్లు... తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఒక్కటే అవకాశం. విజయవంతమైనా, విఫలమైనా అది ఆ ఒక ప్రయత్నంలోనే. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన భయాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయకూడదు. ప్రోత్సాహం ద్వారా వారి మీద వాళ్లకు నమ్మకం కలిగించాలి. సెల్ఫ్ ట్రస్ట్ కోల్పోయే విధంగా భద్రంగా పెంచినట్లయితే... వాళ్లు భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటారు. గోడ ఎక్కడంలో జారిపడితే, పడకుండా ఎక్కగలిగే వరకు మాత్రమే వెంట ఉండి ధైర్యం చెప్పాలి. అలాగే ‘చెట్టు ఎక్కాల్సింది నువ్వే, నువ్వు నేర్చుకునే వరకు నీకు సహాయంగా ఉంటాను’ అనే భరోసాను మాత్రమే తల్లిదండ్రులు ఇవ్వాల్సింది. ‘పడిపోతావు కాబట్టి చెట్టు ఎక్కవద్దు’ అని భయపెట్టడం మానాల్సిందే. ఇందులో మరోమాటకు తావులేదు. డాక్టర్ సుదర్శని సబ్బెళ్ళ క్లినికల్ సైకాలజిస్ట్, జి జి హెచ్, కాకినాడ – వాకా మంజులారెడ్డి -
ప్రతి ఒక్కరికీ కరోనా టీకా : ప్రధాని మోదీ భరోసా
సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారి రెండవసారి విజృంభణతో ఆందోళన చెందుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పౌరులకు ఊరటనందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ అందిస్తామంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా బలహీనమైన వారికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకా వేయడంపై దృష్టి పెట్టినప్పటికీ, దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, ట్రయల్స్ కొనసాగుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు. వ్యాక్సిన్ మోతాదు తదితర మార్గదర్శకాలను ఈ నిపుణుల బృందం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారి టీకా ప్రతి వ్యక్తికి చేరేలా 28వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టీకా పంపిణీని పర్యవేక్షిస్తాయన్నారు. అలాగే లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు. వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నాం. అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది.. మళ్లీ కొన్ని నెలల తరువాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వివరించారు. అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైందని పునరుద్ఘాటించారు. కాగా దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణ పనులు ఎలా జరుగుతాయో, వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను కూడా అలాగే అభివృద్ధి చేయాలని గత వారం ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు 80 లక్షలను దాటేసింది. మరణించిన వారి సంఖ్య 1,20,527 కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 517 మంది ప్రాణాలు కోల్పోయారు. -
నేడు జిల్లాకు శాసనమండలి హామీల అమలు కమిటీ రాక
కర్నూలు(అగ్రికల్చర్): శాసన మండలి హామీల అమలు (అస్యూరెన్స్)కమిటీ గురువారం కర్నూలుకు రానుంది. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా అనే విషయాలపై కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు, సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎం.సుధాకర్‌బాబు, పీజే చంద్రశేఖర్‌రావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాకు సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన 25 ప్రశ్నల్లో చాలా వరకు ఇంతవరకు పరిష్కారం కాలేదు. కర్నూలు పేపర్ మిల్, బీడీ కార్మికులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ సర్జరీ యూనిట్ ఏర్పాటు, తుంగభద్రపై ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్డీఎస్కు సంబంధించి రాజోలిబండ రిజర్వాయర్, రాయలసీమ యూనివర్సిటీలోని నియామకాలలో రిజర్వేషన్ల అమలు, పశువులకు నీరు, మేత, రోడ్డు ప్రమాదాలు తదితర హామీల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో పాటు అస్యూరెన్స్కు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొంటారు. -
గిరిజనులు సహకరిస్తే ఉపాధికి భరోసా
గూడెంకొత్తవీధి: మన్యంలో ఏపీఎఫ్డీసీ కాఫీ తోటల్లో సాగు చేసేందుకు గిరిజనులంతా సహకరిస్తే ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఏపీఎఫ్డీసీ డీఎం భరత్‌కుమార్ తెలిపారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. సంస్థకు చెందిన కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. సిరిబాల, అంటిచెట్ల వీధి, ఎర్రవరం, రామగెడ్డ, జీవనలంక గ్రామస్తులతో మాట్లాడారు. అడవుల సంరక్షణతో పాటు కాఫీ తోటల ద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివద్ధి చెందాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితమే మన్యంలో ఏపీఎఫ్డీసీ కాఫీ సాగుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. సంస్థను నమ్ముకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 6 వేల మంది ఉపాధి పొందుతుండేవారన్నారు. మన్యంలో ప్రతికూల పరిస్థితులతో తోటలు వథా మన్యంలో కొంతకాలంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సంస్థ ఆధీనంలో ఉన్న కాఫీ తోటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. దీని వల్ల మంచి ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలు వథాగా మారుతున్నాయన్నారు. దీంతో నిర్వహణ పనులు లేక స్థానికంగా ఉన్న గిరిజనులు పరోక్షంగా ఉపాధి కోల్పోయారన్నారు. కాఫీ తోటలను సంరక్షించుకోవాలన్న తపన తమ సంస్థ అధికారులకు ఉన్నా మన్యంలో నెలకొన్న ఇబ్బందుల వల్ల తాము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు తమకు ఉపాధి కల్పించాలని తమ సంస్థను కొద్ది రోజులుగా కోరుతున్నారన్నారు. వారి కోరిక మేరకు తాము మన్యంలో కాఫీ తోటల సంరక్షణ ద్వారా ఉపాధి కల్పించాలని భావిస్తున్నామన్నారు. గిరిజనులంతా తమకు సహకరిస్తే వారి ఉపాధికి భరోసా కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.ఈ పర్యటనలో ఆర్వీ నగర్ డీఎం ధన్‌రాజ్, రేంజి అధికారులు సత్యనారాయణ, పడాల్ పాల్గొన్నారు. -
ఎన్నికల్లో నేనే ఖర్చుపెడతా నేనే గెలిపిస్తా..
పార్టీ నేతలకు చంద్రబాబు హామీ ♦ అన్ని పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటా.. ♦ ఇకపై ఎన్నికలన్నీ ఏకపక్షంగా జరగాలి ♦ వలసలను ప్రోత్సహిద్దాం, చేరేవారితో సమన్వయం చేసుకోండి సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖర్చు గురించి పార్టీ ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ ఆలోచించవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతా తానే చూసుకుంటానని వారికి హామీనిచ్చారు. తానే ఖర్చుచేసి తానే గెలిపిస్తానన్నారు. గురువారం సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల వారిని టీడీపీలో చేర్చుకుంటానని, ఎవ్వరూ అడ్డు చెప్పొద్దని, కొత్తగా పార్టీలో చేరిన వారితో సమన్వయంగా ముందుకు వెళ్లాలని తన పార్టీవారికి హితబోధ చేశారు. రాష్ర్టంలో సింగపూర్ తరహా రాజకీయం రావాలని, ఎన్నికలు ఏకపక్షంగా జరిగి అన్నింటిలో తామే గెలవాలని ఆశించారు. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి కాబట్టి ఒకటి, రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలని చంద్రబాబు చెప్పారని టీడీపీ వర్గాల సమాచారం. రాష్ర్టంలో రెండో పార్టీ మనుగడ సాధించకూడదనే లక్ష్యంతో అందరూ పని చేయాలని సూచించారు. సింగపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఒకే పార్టీ ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ఉండాలనే ఉద్దేశంతో సింగపూర్‌లో రెండు, మూడు సీట్లను విపక్షాలకు కేటాయిస్తారని, ఇక్కడ కూడా అలానే చేసే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 మండలి స్థానాలు పెరుగుతాయని, పార్టీలో ఉన్న, చేరే వారిలో అప్పటికి సమర్థులు ఎవరో గుర్తించి టిక్కెట్లు ఇప్పించి గెలిపిస్తానన్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమన్వయంతో పని చేసుకోవాలని, రెండు వారాలకో మారు సమావేశమై జిల్లాల్లో రాజకీయ, ఇతర పరిస్థితులను సమీక్షించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతి మూడు నెలలకోమారు అంచనా వేసి టిక్కెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రన్నవాడ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్ 14న ప్రారంభించే గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని అయితే కేటాయింపులు మాత్రం వారి వాటా చెల్లించిన వెంటనే చేస్తామన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీకి పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 1,800 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తారని, అందులో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మనుమడి పుట్టిన రోజు సందర్భంగా విందు ఏప్రిల్ 8న(ఉగాది) తన మనుమడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో 1,500 మందికి విందు ఇవ్వనున్నట్లు చెప్పారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారులు పాల్గొననున్నారు. సీఎంను కలిసిన నిమ్మగడ్డ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కానున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రీస్కూళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను తక్షణమే ప్రీస్కూళ్లుగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రీస్కూళ్ల కోసం ఈ ఏడాది ఐదు వేల సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. -
సహన కుటుంబానికి షర్మిల భరోసా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మాణికేశ్వర్ నగర్‌కు చేరుకున్న ఆమె.. వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన బొంత సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన కుటుంబ సభ్యులు బుధవారం షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. నిరుపేద చిన్నారి సహన ఆరోగ్య పరిస్థితిపై 'సాక్షి' వెలువరించిన కథనాలకు పలు స్వచ్ఛంద సంస్థలు స్పందించిన విషయం తెలిసిందే. -
లోటులో రాష్ట్ర బడ్జెట్
బుచ్చిరెడ్డిపాళెం : రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటులో ఉందని, అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సమ యం పడుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం ఇస్కపాళెం పంచాయతీ అంబేద్కర్ నగర్, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పింఛన్ల తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం క నీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పడిందన్నారు. రుణమాఫీకి రూ.45 వేల కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పింఛన్ల పెంపు కూడా హామీలో భాగంగా నెరవేర్చాల్సి వచ్చిందన్నారు. రుణమాఫీకి సంబంధించి సాంకేతిక, పరిపాలన సమస్యలున్నందున తొలుత అక్టోబర్ 2న పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. త్వరలో రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రాష్ట్ర పరిస్థితి మరో నెలలో గాడిలో పడనుందని, అప్పుడు వికలాంగులకు పింఛన్ ఇచ్చేందుకు 60 శాతం అర్హతగా గుర్తిస్తామన్నారు. పింఛన్ల తనిఖీల్లో కమిటీ సభ్యులు ఎదుర్కొన్న సమస్యలను సీఎంకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మరో నెలలో వివిధ విభాగాలను అనుసంధానం చేస్తూ ఏడు మిషన్లు, 5 గ్రిడ్లతో పరిపాలన సీఎం చంద్రబాబు చేయనున్నారని మంత్రి వివరించారు. ఎక్కువగా వనరులున్న జిల్లా నుంచి తక్కువగా ఉన్న జిల్లాలో ఆయా వనరులను వినియోగించుకోవడమే గ్రిడ్ల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు రొండ్ల జయరామయ్య, ఎంపీపీ దొడ్ల విజయలక్ష్మి, ఎంపీడీఓ చిలకల శ్రీహరిరెడ్డి, తహశీల్దార్ రామలింగేశ్వరరావు, సర్పంచ్ జూగుంట స్నేహలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ రాక 4 గంటల సేపు ఆల స్యం కావడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు మం త్రి వస్తారని అధికారులు చెప్పడంతో ఒంటి గంట నుంచే పడిగాపులు పడ్డారు. అర్హులకు అన్యాయం చేయిస్తే ఊరుకునేది లేదు : మంత్రి బాలాయపల్లి:అర్హులకు పింఛను రద్దు చేస్తే ఊరుకునేది లేదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని వెంగమాంబపురం, పచ్చారుచేను, బాలాయపల్లి గ్రామాల్లో పింఛన్ల అర్హత పరిశీలనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించాలని కమిటీ సభ్యులకు సూచించారు. కమిటీ ఇచ్చిన తొలగింపు జాబితాను త్వరలో పింఛను పరిశీలన బృందం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు పింఛను, రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని, నేడు ఆ కష్టాలు లేవన్నారు. రైతులకు 7 గంటలు ఇస్తున్నామని, త్వరలో 9 గంటలు ఇస్తామన్నారు. ఏ ఫీడర్లో ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో ప్రత్యేకమైన బృందాలు పరిశీ లిస్తున్నాయన్నారు. గ్రామాల్లో గృహవసరాలకు 14 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. డీఎస్పీపై మంత్రి ఆగ్రహం మండలంలో 24 పంచాయతీల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నా.. మీరు ఏమీ చేస్తున్నారని మంత్రి నారాయణ గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిపై మండిపడ్డారు. రెండు రోజుల్లో మండలంలో బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మకుండా అధిక రేట్లకు అమ్మడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రం స్పష్టీకరణ!
హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీతో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. రుణ మాఫీ హామీ కోసం తమ నుంచి ఎటువంటి సాయాన్ని ఆశించరాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఒక రాష్ట్రం పరిధిలో ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం పూచీ తీసుకోవాలంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇలాంటి డిమాండ్లే వస్తాయని, రాష్ట్రాలకుసాయం అందించడంలో వివక్ష చూపజాలమని పేర్కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారవర్గాలు తెలిపాయి. -
హామీలు అమలు చేయండి బాబు
ఒంగోలు అర్బన్ : బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను భేషరతుగా అమలు చేయాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు వరుసపెట్టి ఉద్యోగాలు తీసేస్తున్నారని వైవీ దుయ్యబట్టారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఆయన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి కష్టమొచ్చినా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. రుణమాఫీపై ప్రమాణస్వీకారం రోజున తొలి సంతకం చేస్తానని చెప్పి.. అధ్యయన కమిటీ ఫైల్‌పై సంతకం చేయడంతో రైతులు అయోమయంలో పడ్డారని అన్నారు. బ్యాంకర్ల ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న రైతులకు చంద్రబాబు ఏ విధంగా భరోసా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ బేస్‌పై పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఎంపీ తప్పుబట్టారు. వైఎస్సార్ సీపీకి చెందిన రేషన్ డీలర్లను తొలగించడం, వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం లాంటివి మానుకోవాలని హితవు పలికారు. 40 రోజులుగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపకపోతే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా పోరాటానికి దిగుతానని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా.. త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక కారిడార్, బీహెచ్ఈఎల్ లాంటి పరిశ్రమలు అవసరమన్నారు. జిల్లాలో షిప్‌యార్డ్, విమానాశ్రయం ఏర్పాటు చేస్తే పరిశ్రమల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నడికుడి రైల్వేలైన్ ఏర్పాటైతే ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉంటుందన్నారు. యూపీఏ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం రామాయపట్నంలో ఏర్పాటు చేయాల్సిన పోర్టును దుగరాజపట్నం తీసుకెళ్లిందని విమర్శించారు. పశ్చిమ ప్రకాశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వే చార్జీలు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం
అత్తాపూర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కళ్యాణ మండపంలో మంత్రిని పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఘనంగా సన్మానించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తాడో.. లేదో తెలియదు కానీ.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని అంతకన్నా అభివృద్ధి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతుల రుణమాఫీతో పాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని, ఏ రైతుకూ అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరిస్తామని, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ్ర పతి కార్యకర్త పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 50 కార్పొరేటర్లను జిల్లాలో గెలిచే దిశగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. తనను ఇంతగా ఆదరించిన జిల్లా ప్రజలను ఎన్నటికీ మరిచిపోనన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, పురుషోత్తం, టి. అరుణ, నాయకులు ఎ. స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, పోరెడ్డి ధర్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, సత్యం, వేణుగోపాల్‌రెడ్డి, మహేష్, పరమేశ్, రేణుక, నరోత్తంరెడ్డి, అన్ని మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పీవీ జయంత్యుత్సవంలో.. హైదర్‌గూడ చౌరస్తాలో నియోజకవర్గ పార్టీ నాయకుడు రావుల విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. -
ఆందోళన అనవసరం చిదంబరం భరోసా
న్యూఢిల్లీ: రూపాయి విలువ బలహీనపడినప్పటికీ ఆందోళన చెందనక్కర్లేదని ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న క్లిష్ట స్థితులను అధిగమించగలమని చెప్పారు. ఇన్వె స్టర్లు నిరాశపడొద్దన్నారు. వివిధ అంశాలపై ఇంకా ఆయన ఏమన్నారంటే... కరెన్సీ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితి పట్ల మరీ ఆందోళన అక్కర్లేదు. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల మన దేశమే కాదు. వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఈ తరహా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నాయి. రూపాయి విషయానికి వస్తే ఉండాల్సిన స్థాయికన్నా విలువ తక్కువ ఉంది. తప్పనిసరిగా తగిన స్థాయికి బలోపేతం అవుతుంది. ఈ దిశలో సర్దుబాటు జరుగుతుంది. ఫారెక్స్ మార్కెట్లో ఒడిదుడుకులు, రూపాయిలో స్పెక్యులేషన్‌ను తగ్గించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు- కరెన్సీలో స్థిరత్వం ఏర్పడిన తరువాత తిరిగి వెనక్కు తీసుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు, వృద్ధికి తగిన చర్యలు దేశ ఆర్థికరంగ పునరుత్తేజానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. పెట్టుబడులు, దేశ స్థూల ఆర్థికాభివృద్ధి రేటు ఊపుపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు కొంత నిరుత్సాహకరంగానే ఉండే అవకాశం ఉంది. అయితే అటు తర్వాత 2,3,4 త్రైమాసికాల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. క్యాపిటల్ కంట్రోల్స్ ఆలోచన లేదు... కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- దేశంలోకి వచ్చీ, పోయే విదేశీ మారక నిధుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎటువంటి క్యాపిటల్ కంట్రోల్స్ నియంత్రణలనూ ప్రవేశపెట్టే యోచన లేదు. క్యాపిటల్ అకౌంట్ సరళీకరణ విధానాన్ని వెనక్కు మళ్లించే విధానం అటు ప్రభుత్వంవైపునకానీ, ఇటు ఆర్బీఐ వైపునకానీ లేదు. ఫెడరల్ రిజర్వ్‌పై కామెంట్... అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాలను ఎదుర్కొనడానికి భారత్ సంసిద్ధంగా ఉండాలి. ద్రవ్యలోటు, క్యాడ్‌పై ఇలా... ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకుంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 4.8 శాతానికి, క్యాడ్ 3.7 శాతానికి ( (70 బిలియన్ డాలర్లు) మించకుండా చూస్తాం. అదుపులో రుణ పరిస్థితి: దేశ రుణ భారం తగిన స్థాయిలోనే ఉంది. 2006-07లో జీడీపీలో ఈ నిష్పత్తి 73.2 శాతం ఉంటే, 2012-13లో 66 శాతానికి తగ్గింది. ఆర్థిక వ్యవస్థ విదేశీ రుణ భారం జీడీపీలో 21.2 శాతం మాత్రమే. ఇక ప్రస్తుతం భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిమాణం ప్రస్తుతం 277 బిలియన్ డాలర్లుగా ఉంది. మొండి బకాయిలు... బ్యాంకింగ్‌లో మొండి బకాయిలు (ఎన్పీఏ)లు పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే పలు ప్రాజెక్టులు ఇంకా ఆర్థికంగా సానుకూల ఫలితాలను అందించే స్థాయిలోనే ఉండడం ఇక్కడ సానుకూల ధోరణిలో చెప్పుకోవాల్సిన అంశం. నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రారంభించడానికి సైతం ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుంది. ఇక బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో కూడా బాసెల్ ప్రమాణాలకన్నా మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.14,000 కోట్ల కొత్త పెట్టుబడులు సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనింగ్ కీలకం వృద్ధి మెరుగుకు బొగ్గు ఉత్పత్తి కీలకం. ఈ రంగంలో ఉత్పత్తి పెరగడానికి తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. బొగ్గు దిగుమతుల్లో అనిశ్చితి తొలగింపు, ఇనుప ఖనిజం మైనింగ్ పునఃప్రారంభం వంటి చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే ఎరువుల కర్మాగారం సామర్థ్యం పెంపునకు సైతం కృషి జరుగుతోంది. ముడి ఇనుము ఎగుమతులపై సుంకాలు విధించడానికి సంబంధించిన అంశం పరిశీలనలో ఉంది. ముడి ఇనుము మైనింగ్‌ను తిరిగి సుసంపన్నం చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సావరిన్ బాండ్లపై ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి సావరిన్ బాండ్ల జారీసహా అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తుంది. తగిన సమయంలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యను ప్రభుత్వం తీసుకుంటుంది.