హామీలన్నీ నెరవేరుస్తాం
అత్తాపూర్ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక కళ్యాణ మండపంలో మంత్రిని పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఘనంగా సన్మానించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తాడో.. లేదో తెలియదు కానీ.. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని అంతకన్నా అభివృద్ధి చేస్తుందని మంత్రి తెలిపారు.
రైతుల రుణమాఫీతో పాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని, ఏ రైతుకూ అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరిస్తామని, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ్ర పతి కార్యకర్త పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలన్నారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 50 కార్పొరేటర్‌లను జిల్లాలో గెలిచే దిశగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. తనను ఇంతగా ఆదరించిన జిల్లా ప్రజలను ఎన్నటికీ మరిచిపోనన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, పురుషోత్తం, టి. అరుణ, నాయకులు ఎ. స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి, పోరెడ్డి ధర్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, సత్యం, వేణుగోపాల్‌రెడ్డి, మహేష్, పరమేశ్, రేణుక, నరోత్తంరెడ్డి, అన్ని మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
పీవీ జయంత్యుత్సవంలో..
హైదర్‌గూడ చౌరస్తాలో నియోజకవర్గ పార్టీ నాయకుడు రావుల విశ్వనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.