ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న బి. ప్రసాదరావు రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఏసీబీ డీజీగా ఏకే ఖాన్కు పూర్తి స్థాయిలో అదనపు బాధ్యలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.