హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని డిపోల మేనేజర్లకు ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని, ఆర్టీసీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
భారీ వాహనాల లెసైన్సు కలిగిన వారు ఆయా డిపోల్లో సంప్రదించాలని కోరారు. కండక్టర్ల తాత్కాలిక విధులకు పదో తరగతి పాసైన వారు సంప్రదించాలని, రోజుకు రూ.800 వేతనం అందిస్తామన్నారు. డ్రైవర్లకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి తిరిగి డబ్బు వాపసు చేయడమో.. లేదా సమయానికి ప్రయాణీకుల్ని ఆయా ప్రాంతాలకు పంపేందుకు నిర్ణయించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కల్పించేందుకు డిపోల అధికారులు పోలీసులను సంప్రదించాలని ఆదేశించారు.
ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ మార్గాలు
Published Tue, May 5 2015 9:38 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement