samba sivarao
-
గుంటూరులో ఉద్రిక్తత
గుంటూరు కొత్తపేటలోని ఆంధ్రా ఇవాంజికల్ లూథరన్ చర్చి ఆస్తులలో ఒకటైన గుంటగ్రౌండ్స్ ప్రహరీ గోడపై ఉన్న క్రీస్తు వాక్యాలను నగరపాలక సంస్థ అధికారులు శుక్రవారం చెరిపివేయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్పొరేషన్ డీఈ సాంబశివరావు ఆదేశం మేరకు కాంట్రాక్టర్ ఈ చర్యకు ఉపక్రమించారు. మధ్యాహ్నానికి సిబ్బంది కొన్ని గోడలపై ఉన్న వాక్యాలను తొలగించి భోజనానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన ఏఈఎల్సీ బిషప్ రెవరెండ్ పరదేశీబాబు, ట్రెజరర్ జి.పాల్ ప్రభాకర్, ప్రిన్సిపాల్ టి.ముత్యం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుంటగ్రౌండ్స్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొత్తపేట సీఐ వెంకన్నచౌదరి ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందిగా పరుష పదజాలంతో హెచ్చరించారు. దీంతో అధ్యాపకులు, విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న సంఘీయులకు సమాచారం అందించడంతో వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐ దురుసు మాటలకు నిరసనగా నాజ్ సెంటర్ కూడలిలోని నాలుగు వైపుల రాస్తారోకో చేసారు. కమిషనర్, డీఈ, సీఐలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్‌కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులతో చర్చించి సంఘటన తప్పేనని, గోడలపై తిరిగి క్రీస్తు వాక్యాలు రాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అక్రమంగా స్థలం ఆక్రమణ ప్రిన్సిపాల్ ముత్యం మాట్లాడుతూ రెండు నెలల కిందట గుంటగ్రౌండ్స్ ముందు ఉన్న రోడ్డును వెడల్పు చేయడంలో భాగంగా రోడ్డుకు ఒకవైపు ఉన్న గుంటగ్రౌండ్స్ గోడను పగులగొట్టి 22 అడుగుల మేర రోడ్డులోకి కలిపి కార్పొరేషన్ అధికారులు గోడ కట్టారన్నారు. క్రైస్తవ సంఘాల నాయకులు దీన్ని అక్రమమని అడ్డుకుంటే అరెస్టు చేశారని ఆరోపించారు. రోడ్డుకు రెండోవైపు ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ స్థలంలో ఒక్క అంగుళం కూడా రోడ్డు విస్తరణకు తీసుకోలేదన్నారు. ఇప్పుడు క్రీస్తు వాక్యాలు తుడిపివేయడం సంఘీయులందరికీ అవమానకరమన్నారు. -
బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!
-
బెజవాడ బస్టాండ్‌కు 5జీ వైఫై!
ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తొలి 15 నిమిషాలే ఉచితం విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు 5జీ వైఫై హంగులు అందివచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న 3జీ, 4జీ కన్నా అప్డేట్గా 5జీ వైఫై అందించడం విశేషం. ఈ సేవలను రానున్న 3 నెలల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న బస్టాండుల్లో అందుబాటులోకి తేనున్నారు. క్వాడ్జెన్, బీఎస్ఎన్ఎల్, ఏపీఎస్ ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో క్యూఫై లైఫ్ ః 5జీ సేవలను ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. విజయవాడ బస్‌స్టేషన్‌కు రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 17 వైఫై ఆపరేట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో వైఫై పాయింట్ పరిధిలో 400 మంది సేవలు పొందేలా డిజైన్ చేశారు. బ్రౌజింగ్లోకి వెళ్లి యూజర్ నేమ్, మొబైల్ నంబర్ నమోదు చేసుకున్నాక వచ్చే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ సేవలు పొందవచ్చు. తొలి 15 నిమిషాలే ఉచితం.. బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వైఫై సేవలు ఒక యూజర్‌కు తొలి 15 నిమిషాలే ఉచితంగా అందిస్తారు. అనంతరం ఈ సేవలను స్క్రాచ్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయాలి. బస్టాండ్‌లోని అవుట్లెట్లలో రూ.30, 60, 90 స్క్రాచ్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. కనెక్ట్కాక తికమక ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఫై సేవలను ప్రారంభించి.. నగర పోలీస్ కమిషనర్ వేంకటేశ్వరరావుతో 5జీ కాల్ మాట్లాడిన కొద్ది సేపటికే వినియోగదారులు వైఫై సేవలు అందక తికమకపడ్డారు. అదేమంటే వైఫై యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ విషయంలో అవగాహన లేకపోవడమే కారణమని తెలిసింది. యూజర్ నేమ్, మొబైల్ నంబర్, పాస్ట్‌వర్డ్ ఎంటర్ చేసే అవగాహన లేకుంటే వైఫై సేవలు అందని ద్రాక్షే. హైదరాబాద్‌లో రోజూ 3 వేల మంది యూజర్లు హైదరాబాద్‌లోనూ తామే వైఫై సేవలందిస్తున్నామని, ఇటీవల నక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వైఫై జోన్లో రోజుకు 3 వేల మంది యూజర్లు ఉపయోగించుకుంటున్నారని క్వాడ్జెన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో-బెంగళూరు) సతీష్ బెనర్జీ ‘సాక్షి’కి చెప్పారు. బీఎస్ఎన్ఎల్తో కలసి 9 రాష్ట్రాల్లో వైఫై సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. బస్టాండ్‌లో వైఫై సేవలు ఏపీలో మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ మార్గాలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల మేనేజర్లకు ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని, ఆర్టీసీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వాహనాల లెసైన్సు కలిగిన వారు ఆయా డిపోల్లో సంప్రదించాలని కోరారు. కండక్టర్ల తాత్కాలిక విధులకు పదో తరగతి పాసైన వారు సంప్రదించాలని, రోజుకు రూ.800 వేతనం అందిస్తామన్నారు. డ్రైవర్లకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి తిరిగి డబ్బు వాపసు చేయడమో.. లేదా సమయానికి ప్రయాణీకుల్ని ఆయా ప్రాంతాలకు పంపేందుకు నిర్ణయించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కల్పించేందుకు డిపోల అధికారులు పోలీసులను సంప్రదించాలని ఆదేశించారు.