alternative routes
-
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
ఆధార్ ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయాలేంటి?
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ మార్గాలను తెలపాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రైవేట్ టెలికం కంపెనీలను కోరింది. టెలికం వినియోగదారుల ధ్రువీకరణలో 12 అంకెల ఆధార్‌ను వాడటం నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్పీ)కు యూఐడీఏఐ ఇటీవల ఒక సర్క్యులర్ పంపింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణమే టీఎస్పీలు చర్యలు చేపట్టాలి. ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 15వ తేదీలోగా మాకు పంపండి’ అని అందులో యూఐడీఏఐ కోరింది. యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే దీనిపై వివరణ ఇస్తూ..‘ఆధార్ నిబంధనల ప్రకారం ఈ–కేవైసీ విధానం నుంచి సజావుగా బయటకు వచ్చేందుకు మరికొన్ని చర్యలు అవసరమవుతాయి. ఈ విషయంలో టెలికం కంపెనీలకు అవగాహన ఉంటుంది కాబట్టే 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను పంపాలని కోరాం’ అని తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ మార్గాలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల మేనేజర్లకు ఎండీ సాంబశివరావు ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని, ఆర్టీసీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భారీ వాహనాల లెసైన్సు కలిగిన వారు ఆయా డిపోల్లో సంప్రదించాలని కోరారు. కండక్టర్ల తాత్కాలిక విధులకు పదో తరగతి పాసైన వారు సంప్రదించాలని, రోజుకు రూ.800 వేతనం అందిస్తామన్నారు. డ్రైవర్లకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. రిజర్వేషన్లు చేయించుకున్న వారికి తిరిగి డబ్బు వాపసు చేయడమో.. లేదా సమయానికి ప్రయాణీకుల్ని ఆయా ప్రాంతాలకు పంపేందుకు నిర్ణయించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు కల్పించేందుకు డిపోల అధికారులు పోలీసులను సంప్రదించాలని ఆదేశించారు.