
'జూలై 1న ఆర్టీసీ విభజన'
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఆ కమిటీ తన నివేదికను త్వరలో తమకు అందజేయనుందని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 1వ తేదీన ఆర్టీసీని విభజిస్తామని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు.