ఆర్టీసీ యూనియన్ నేతలలో ఎండీ సురేంద్రబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు గంటకు పైగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అంగీకరించలేదు. దీంతో చర్చల మధ్య నుంచే ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, దామోదర్ రావులు బయటకు వచ్చారు.అనంతరం జేఏసీ నాయకులు మీడీయాతో మాట్లాడుతూ.. వేతన సవరణపై మీటింగ్‌లో చర్చించామని చెప్పారు.