rtc union leaders
-
‘ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీ యూనియన్ నేతలలో ఎండీ సురేంద్రబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు గంటకు పైగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అంగీకరించలేదు. దీంతో చర్చల మధ్య నుంచే ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, దామోదర్ రావులు బయటకు వచ్చారు.అనంతరం జేఏసీ నాయకులు మీడీయాతో మాట్లాడుతూ.. వేతన సవరణపై మీటింగ్లో చర్చించామని చెప్పారు. 50శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తే 20శాతానికి మించి ఇవ్వలేమని ఎండీ తేల్చిచెప్పారని, దానికి తాము అంగీకరించలేదన్నారు. తాము చేపట్టబోయే సమ్మేను విరమించే ప్రసక్తే లేదన్నారు. బుధవారం ఉదయం జేఏసీ సమావేశం నిర్వహించి సమ్మె తేదిని ప్రకటిస్తామని చెప్పారు. ఒకవైపు చర్చలు జరుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. తమది న్యాయమైన డిమాండ్లు అని, వాటిని సాధించుకునే వరకు పోటాటం చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాబోయే బడ్జెట్లో ఆర్టీసీకి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
‘ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే ప్రభుత్వానిదే బాధ్యత’
-
వైఎస్ జగన్ను కలిసిన ఆర్టీసీ యూనియన్ సభ్యులు
-
ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన శనివారం ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలను కేబినెట్ సబ్ కమిటీతో మాట్లాడాలని సూచించారు. కార్మిక సంఘాలు చర్చకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పీఆర్సీ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చల మధ్య లోంచి లేచి వెళ్లిపోవడం, ఇక వారిని చర్చలకు పిలిచేది లేదని చెప్పడం తెలిసిందే. ఈ విషయంపైనే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
రవాణా మంత్రే ఆర్టీసీకి మైనస్..
హైదరాబాద్ : ఆర్టీసీని ప్రయివేట్పరం చేయటానికి కుట్ర జరుగుతోందని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సమ్మె కొనసాగటానికి ఆర్టీసీ ఎండీ వైఖరే కారణమని వారు ఆరోపించారు. ఎండీ సాంబశివరావు నిరంకుశంగా వ్యవహరించారని, ఆయనతో చర్చలు జరిపేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లా ఎండీ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఇక తెలంగాణ రవాణామంత్రి మహేందర్రెడ్డే ఆర్టీసీకి మైనస్ అని టీఎంయూ నేత అశ్వాద్ధామరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెకు హరీష్ రావు మద్దతు తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని టీఎంయూ నేతలు కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, లేకుంటే సోమవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.