ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి | chandrababu naidu unsatisfied on rtc md, minister sidda raghavarao | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి

Published Sat, May 9 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి

ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  ఆయన  శనివారం ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలను కేబినెట్ సబ్ కమిటీతో మాట్లాడాలని సూచించారు. కార్మిక సంఘాలు చర్చకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పీఆర్సీ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చల మధ్య లోంచి లేచి వెళ్లిపోవడం, ఇక వారిని చర్చలకు పిలిచేది లేదని చెప్పడం తెలిసిందే. ఈ విషయంపైనే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement