హైదరాబాద్ : నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పంచాయతీ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు శనివారం వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ కార్మికులతో ...జేఎండీ రమణారావు భేటీ అయ్యే అవకాశం ఉంది.
కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి నాలుగోరోజుకు చేరింది. కార్మిక సంఘాలతో నిన్న ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు.
చంద్రబాబు దగ్గరకు ఆర్టీసీ పంచాయతీ
Published Sat, May 9 2015 10:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM
Advertisement
Advertisement