
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వలేం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉద్యోగులకే 43శాతం ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు 43శాతం ఫిట్మెంట్ ఇస్తే రవాణా ఛార్జీలు పెంచవలసి ఉంటుదని అన్నారు.
రవాణా ఛార్జీలు పెంచితే ప్రభుత్వంపై ప్రజలలలో వ్యతిరేత వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రేపు ఆర్టీసీ కార్మికులతో సమావేశమై సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు.