rtc md sambasivarao
-
దసరా రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు
విజయవాడ (బస్స్టేషన్) : దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి తగినవిధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఈడీలు, ఆర్ఏం, సీటీఏంలతో సమావేశమయ్యారు. దసరా ఏర్పాట్లు, నడుపుతున్న బస్సుల వివరాల గురించి ఎండీ సాంబశివరావు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు పంపుతున్నామని, 11న 200 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు ఎండీకి వివరించారు. ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ పండగ సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, ప్రయివేట్ ఆపరేటర్ల తీరుతో మోసపోతున్నారని, వీటిని నియంత్రించేందుకు ఆర్టీసీ ప్రయివేట్ ఆపరేటర్లకు దీటుగా బస్సులు నడపాలని ఆదేశించారు. ఈడీలు జయరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఆర్ఎం రామారావు, సీటీఏంలు శ్రీరాములు, జాన్సుకుమార్, సుధాకర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన శనివారం ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలను కేబినెట్ సబ్ కమిటీతో మాట్లాడాలని సూచించారు. కార్మిక సంఘాలు చర్చకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పీఆర్సీ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చల మధ్య లోంచి లేచి వెళ్లిపోవడం, ఇక వారిని చర్చలకు పిలిచేది లేదని చెప్పడం తెలిసిందే. ఈ విషయంపైనే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
రవాణా మంత్రే ఆర్టీసీకి మైనస్..
హైదరాబాద్ : ఆర్టీసీని ప్రయివేట్పరం చేయటానికి కుట్ర జరుగుతోందని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సమ్మె కొనసాగటానికి ఆర్టీసీ ఎండీ వైఖరే కారణమని వారు ఆరోపించారు. ఎండీ సాంబశివరావు నిరంకుశంగా వ్యవహరించారని, ఆయనతో చర్చలు జరిపేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్లా ఎండీ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఇక తెలంగాణ రవాణామంత్రి మహేందర్రెడ్డే ఆర్టీసీకి మైనస్ అని టీఎంయూ నేత అశ్వాద్ధామరెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెకు హరీష్ రావు మద్దతు తమకు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని టీఎంయూ నేతలు కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, లేకుంటే సోమవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు దగ్గరకు ఆర్టీసీ పంచాయతీ
హైదరాబాద్ : నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పంచాయతీ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు శనివారం వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ కార్మికులతో ...జేఎండీ రమణారావు భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి నాలుగోరోజుకు చేరింది. కార్మిక సంఘాలతో నిన్న ఆర్టీసీ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. -
ఆర్టీసీ బాస్ కొత్త ఎత్తులు..
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెను భగ్నం చేసేందుకు ఆర్టీసీ బాస్ కొత్త ఎత్తులు ఉపయోగిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ...ఆర్టీసీపై పోలీస్ మార్క్ చూపిస్తున్నారు. విభజించి పాలించు అనే పాలసీని అమలుకు సిద్ధం అవుతున్నారు. కార్మిక సంఘాల నుంచి కార్మికులను దూరం చేస్తేలా ప్రయత్నిస్తున్నారు. గతంలో సస్పెండ్, రీమూవల్స్ అయినవారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం యోచన చేస్తోంది. కార్మికులపై ఉన్న చిన్న చిన్న పనిష్మెంట్లను ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే కాంట్రాక్టత్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామనడంపై కార్మిక సంఘాల్లో ఆందోళన మొదలైంది. ఏం చేయాలో అర్థం కాక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మెట్టు దిగని ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పే ప్రయత్నాలు చేస్తోంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసినట్లు తమకు ఫిట్మెంట్ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. -
ఎంసెట్కు సమ్మె టెన్షన్