ఆర్టీసీ బాస్ కొత్త ఎత్తులు..
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెను భగ్నం చేసేందుకు ఆర్టీసీ బాస్ కొత్త ఎత్తులు ఉపయోగిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ...ఆర్టీసీపై పోలీస్ మార్క్ చూపిస్తున్నారు. విభజించి పాలించు అనే పాలసీని అమలుకు సిద్ధం అవుతున్నారు. కార్మిక సంఘాల నుంచి కార్మికులను దూరం చేస్తేలా ప్రయత్నిస్తున్నారు.
గతంలో సస్పెండ్, రీమూవల్స్ అయినవారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం యోచన చేస్తోంది. కార్మికులపై ఉన్న చిన్న చిన్న పనిష్మెంట్లను ఎత్తివేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే కాంట్రాక్టత్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామనడంపై కార్మిక సంఘాల్లో ఆందోళన మొదలైంది.
ఏం చేయాలో అర్థం కాక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మెట్టు దిగని ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించి అద్దె బస్సులను తిప్పే ప్రయత్నాలు చేస్తోంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసినట్లు తమకు ఫిట్మెంట్ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.