
తక్షణం విధుల్లోకి వెళ్లాలి: పద్మాకర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికసంఘం నాయకుడు పద్మాకర్ తెలిపారు. బుధవారం నాడు సచివాలయంలో మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లను తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే పెట్టామని, 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. అందువల్ల కార్మికులందరూ తక్షణం విధులకు హాజరవ్వాలని ఆయన కోరారు.