ఏపీలో ఆర్టీసీ సమ్మె ముగిసినట్లే: మంత్రి | rtc strike calls off in andhra pradesh, says minister | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆర్టీసీ సమ్మె ముగిసినట్లే: మంత్రి

Published Wed, May 13 2015 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

ఏపీలో ఆర్టీసీ సమ్మె ముగిసినట్లే: మంత్రి

ఏపీలో ఆర్టీసీ సమ్మె ముగిసినట్లే: మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారమైంది. బుధవారంతో సమ్మె ముగిసినట్లేనని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే...

''కార్మికుల డిమాండ్లను సానుకూలంగా నెరవేర్చాలనే భావించాం. ఆర్టీసీ సంస్థ ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోంది. ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో ఉంది. కొత్త రాష్ట్రం కావడంతో అనేక సమస్యలున్నాయి. కార్మికులకు అసంతృప్తి లేకుండా చూడాలని వారు కోరిన 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించాం. ఎరియర్స్ 1200 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయి. ప్రభుత్వ ఇబ్బందులు, సంస్థ ఇబ్బందులు కార్మికులకు చెప్పి, కొంత త్యాగం చేయాలని చెప్పాం. దాంతో ఎరియర్స్ ఇప్పటికి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి, రిటైర్ అయ్యే సమయంలో కార్మికులకు పాత ఎరియర్స్ అన్నీ ఇస్తామన్నాం.. దానికి కార్మికులు అంగీకరించారు. దాంతో ఈరోజుతో సమ్మె పూర్తిగా ముగిసినట్లే. ఇప్పట్లో చార్జీలు పెంచే ఆలోచన మాత్రం లేదు''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement