హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవవేరే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు శుక్రవారం మరోసారి స్పష్టం చేశాయి. కార్మికుల సమ్మెపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించడం లేదు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సదరు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎంఎంటీఎస్కు ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెను సాకుగా చూపి ప్రైవేట్ ట్రావెల్స్ వారు, ఆటోవాలాలు ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు.