అదేదో ముందే ఇచ్చివుంటే...
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. దీంతో 8 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు రెండు ప్రభుత్వాలు ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి.
ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఒకశాతం ఫిట్ మెంట్ ఇచ్చి కార్మికులే ఆశ్చర్యపోయేలా చేసింది.
అయితే 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వలేమని నిన్నటివరకు చెబుతూ వచ్చిన ఏపీ ప్రభుత్వం చివరకు దిగివచ్చింది. ఇదేదో ముందే ఇచ్చివుంటే సమ్మె ఉండేది కాదన్న ప్రశ్నకు ఏపీ మంత్రులు నీళ్లు నమిలారు. తమ డిమాండ్లను ప్రభుత్వాలు అంగీకరించడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుని బాణాసంచా కాల్చారు.