తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు హరీశ్ మద్దతు! | Harish rao supports our strike, says union leader | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు హరీశ్ మద్దతు!

Published Sat, May 9 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు హరీశ్ మద్దతు!

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు హరీశ్ మద్దతు!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మంత్రి హరీశ్ రావు మద్దతు పలుకుతున్నారట!  ఈ విషయాన్ని స్వయంగా కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల్లో బుధవారం నుంచి.. అంటే నాలుగు రోజులుగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హరీశ్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు.

దాంతో.. ఆయన మద్దతు కార్మికులకే ఉంటుందని, అంటే.. సమ్మెకు హరీశ్ మద్దతు పలుకుతున్నట్లేనని టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి. ఒకవైపు మామ కేసీఆర్ సమ్మెను అణిచేయాలని చూస్తేంటే అల్లుడు హరీశ్ రావు సమ్మెకు మద్దతుగా ఉన్నారంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement