నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఈ యూ, టీఎమ్‌యూ నేతలు జరిపిన చర్చలు విఫలమవడంతో ఈనెల 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు నాయకులు పిలుపునిచ్చారు.
అన్ని సంఘాల మద్దతు..
ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూ నియన్ రాష్ట్ర నేతలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఉన్న అన్ని సంఘాల నేతలు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నా యి. జిల్లాలో సుమారు 3,500 కార్మికులు డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేస్తున్నారు. నిజామాబాద్-1, నిజామాబాద్-2 డిపోలు, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల్లో ఈ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇం దులో రెగ్యులర్, ఒప్పంద కార్మికులు ఉన్నారు. కార్మికులంతా వారికి నచ్చిన యూనియన్‌లో ఉన్నారు. జిల్లాలో ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూని యన్ ఐక్య కూటమిగా ఏర్పడి సమ్మె తేదీని ప్రకటించిన విషయం విదితమే. అయితే సీడీసీయూ, ఎస్‌డబ్ల్యూఏఎ ఫ్, ఎస్‌డబ్ల్యూయూ, కేపీ, కెఎస్, డబ్ల్యూ, వైఎస్‌ఆర్‌ఎంయూ తదితర యూనియన్లు అన్ని సమ్మెలో పాల్గొంటున్నాయి.
విజయవంతం చేస్తాం..
ఈనెల 27వ తేదీ నుంచి చేపట్టిన సమ్మెను జిల్లాలో విజయవంతం చేస్తామని అన్ని యూనియన్ నాయకులు, కార్మికులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో చాలాసార్లు చర్చలు జరిగాయని, అయినా ఫలితం లేదని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు అందరికీ తెలిసినా ఎవ్వరు పట్టించుకోవడంలేదని, సమస్యలు పరిష్కరించేదాక స మ్మెను కొనసాగిస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఆరు డిపోల నుంచి 27 నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాదన్నారు. కార్మికులంతా సమ్మెలొ పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరుతున్నారు.
ఆర్టీసీ సమ్మెకు సిద్ధం
Published Sat, Jan 25 2014 6:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement