
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. మొన్నీమధ్య 'కల్కి', 'రాయన్' స్ట్రీమింగ్‌లోకి రాగా.. ఇప్పుడు కొన్ని చిన్న మూవీస్ డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయాయి. ఈ రెండు కూడా ఒకే ఓటీటీలో రెండు రోజుల గ్యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ఆయా తేదీల్ని అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా)
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు'.. జూలై 26న థియేటర్లలోకి వచ్చింది. సినిమా పర్లేదు అనిపించినప్పటికీ.. 'శ్రీమంతుడు'తో పోలికలు రావడంతో మైనస్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే బిగ్ స్క్రీన్‌పై అంటే కష్టం గానీ ఓటీటీలో కాబట్టి దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చేమో!
సహాయ నటుడు రాజా రవీంద్ర.. ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సారంగదరియా'. జూలై 11న రిలీజైన ఈ సినిమాకు టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. కానీ పెద్దగా పేరున్న యాక్టర్స్ లేకపోవడంతో జనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడీ మూవీని కూడా ఆహాలోనే రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ వీకెండ్‌లో దీనిపై కూడా అలా ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)
Discover the intense and emotional world of #Sarangadhariya on @ahavideoIN @Rajaraveendar @AbbisettiPandu #SrikanthKrishnaswamy #YashaswiniSrinivas #ShivakumarRamachandravarapu @Drneelapriya @Bhavanidvd @Bhavanihdmovies pic.twitter.com/L1BKX15NVf
— Bhavani Media (@BhavaniHDMovies) August 26, 2024

Comments
Please login to add a commentAdd a comment