Sarangadariya Movie
-
ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు మూవీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ వస్తూనే ఉంటాయి. మొన్నీమధ్య 'కల్కి', 'రాయన్' స్ట్రీమింగ్‌లోకి రాగా.. ఇప్పుడు కొన్ని చిన్న మూవీస్ డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయాయి. ఈ రెండు కూడా ఒకే ఓటీటీలో రెండు రోజుల గ్యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ఆయా తేదీల్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన టీనేజీ ప్రేమకథ సినిమా)రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు'.. జూలై 26న థియేటర్లలోకి వచ్చింది. సినిమా పర్లేదు అనిపించినప్పటికీ.. 'శ్రీమంతుడు'తో పోలికలు రావడంతో మైనస్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే బిగ్ స్క్రీన్‌పై అంటే కష్టం గానీ ఓటీటీలో కాబట్టి దీన్ని చూస్తూ టైమ్ పాస్ చేసేయొచ్చేమో!సహాయ నటుడు రాజా రవీంద్ర.. ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సారంగదరియా'. జూలై 11న రిలీజైన ఈ సినిమాకు టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. కానీ పెద్దగా పేరున్న యాక్టర్స్ లేకపోవడంతో జనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడీ మూవీని కూడా ఆహాలోనే రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ వీకెండ్లో దీనిపై కూడా అలా ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ)Discover the intense and emotional world of #Sarangadhariya on @ahavideoIN @Rajaraveendar @AbbisettiPandu #SrikanthKrishnaswamy #YashaswiniSrinivas #ShivakumarRamachandravarapu @Drneelapriya @Bhavanidvd @Bhavanihdmovies pic.twitter.com/L1BKX15NVf— Bhavani Media (@BhavaniHDMovies) August 26, 2024 -
ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హ్యాపీ మూమెంట్ ఇదే: రాజా రవీంద్ర
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈనెల 12న రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. 'సారంగదరియాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు సంతోషకరమైన మూమెంట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నా చిత్రానికి ఇంత మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. మంచి కథతో సినిమా తీశాం. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.' అని అన్నారు.దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. కెమెరా డిపార్ట్మెంట్లో ముందుగా పని చేశా. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు. -
ప్రతి ఇంట్లో జరిగే కథ అనిపించింది
‘‘సారంగదరియా’ చిత్రం ట్రైలర్ చూస్తే ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి సందేశం ఇచ్చేందుకు ఈ మూవీ తీశారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూసి,ప్రోత్సహించాలి’’ అన్నారు హీరో నవీన్ చంద్ర. రాజా రవీంద్ర లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించారు. చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నవీన్ చంద్ర అతిథిగా హాజరయ్యారు. ‘‘ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. దీంతో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే విజయం సాధిస్తారనే కంటెంట్‌తో ఈ మూవీ రూపొందింది’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’’ అన్నారు పండు. -
ప్రతీ ఇంట్లో జరిగే కథే ‘సారంగదరియా’: నవీన్‌చంద్ర
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా’. ఈ మూవీతో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జులై 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హీరో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్‌ను కోనుగోలు చేశారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘రాజా రవీంద్ర ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ.. మాలాంటి కొత్త యాక్టర్లకు సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చిత్రంలో ఆయన చాలా కొత్తా కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన ఉమాదేవి, శరత్ చంద్ర థాంక్స్. ప్రతీ ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి మెసెజ్ ఇచ్చేందుకు ఈ చిత్రం తీశారని అర్థం అవుతోంది.ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్లోనే చూడండి’ అని ప్రేక్షకులను కోరారు.రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘కంటెంట్ బాగుండటంతో బలగం ఆడింది. మన సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాత చెబుతుంటూ ఉంటారు. పండు టీం అందరితో చక్కగా పని చేయించుకున్నాడు. మా నిర్మాత సైతం దర్శకుడు పండుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా చిత్రం జూలై 12న రాబోతోంది. అందరూ వీక్షించండి. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద పోరాటం చేస్తోంది. దయచేసి అందరూ డ్రగ్స్‌కి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడకండి.. ట్రోలింగ్ చేయకండి’ అని అన్నారు.‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇలాటి కథ చెప్పినప్పుడు సహజంగా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ మా సాయిజా ప్రొడక్షన్స్ అధినేత శరత్ గారు వెంటనే ఒప్పుకున్నారు. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’అని దర్శకుడు పండు అన్నారు. ఈ ఈవెంట్లో నిర్మాత శరత్ చంద్ర చల్లపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనెజర్ పాల్ , నటి యశస్విని, లిరిక్ రైటర్స్ కడలి, గోశాల రాంబాబు, ఆదిత్య నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.