ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హ్యాపీ మూమెంట్‌ ఇదే: రాజా రవీంద్ర | Raja Ravindra Comments at Sarangadhariya Movie Success Meet | Sakshi
Sakshi News home page

Sarangadhariya Movie: మా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది: రాజా రవీంద్ర

Published Mon, Jul 15 2024 3:17 PM | Last Updated on Mon, Jul 15 2024 3:35 PM

Raja Ravindra Comments at Sarangadhariya Movie Success Meet

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయమయ్యారు.  ఈనెల  12న రిలీజైన ఈ  మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ.. 'సారంగదరియాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. మా సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మోయిన్, మోహిత్, యశస్విని నా కంటే చాలా బాగా నటించారు. అందరి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇదే నాకు సంతోషకరమైన మూమెంట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘సారంగదరియా విడుదలై అన్ని థియేటర్లలో బాగా ఆడుతోంది. ఇంత రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నా చిత్రానికి ఇంత మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. మంచి కథతో సినిమా తీశాం. మున్ముందు ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న నమ్మకం ఉంది. సినిమాలోని ప్రతీ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.' అని అన్నారు.

దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. 'సారంగదరియా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. కెమెరా డిపార్ట్మెంట్‌లో ముందుగా పని చేశా. చివరకు రాజా సర్ వద్దకు చేరాను. నేను కథ చెప్పిన వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన శరత్ గారికి థాంక్స్. మా సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement