
‘‘సారంగదరియా’ చిత్రం ట్రైలర్ చూస్తే ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించింది. దర్శకుడు మంచి సందేశం ఇచ్చేందుకు ఈ మూవీ తీశారని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూసి,ప్రోత్సహించాలి’’ అన్నారు హీరో నవీన్ చంద్ర. రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి (పండు) దర్శకత్వం వహించారు. చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నవీన్ చంద్ర అతిథిగా హాజరయ్యారు. ‘‘ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్ సరిగ్గా ఉండటం లేదు. దీంతో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్ సపోర్ట్ ఇస్తే విజయం సాధిస్తారనే కంటెంట్‌తో ఈ మూవీ రూపొందింది’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’’ అన్నారు పండు.
Comments
Please login to add a commentAdd a comment