కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా 'బాలు గాని టాకీస్.' ఆహా ఓరిజినల్ కంటెంట్‌తో ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. వాస్తవంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి రెండుసార్లు వాయిదా వేశారు. అయితే, తాజాగా 'బాలు గాని టాకీస్' విడుదలపై మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో సినిమా విడుదలపై కాస్త ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.
‘బాలు గాని టాకీస్’లో శివకుమార్ రామచంద్రపు ప్రధాన పాత్రలో నటించారు. ఆయన గతంలో వకీల్‌సాబ్, మజిలీ, నిన్ను కోరి వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. శ్రావ్య వర్మ హీరోయిన్‌గా నటించగా సంగీత దర్శకుడు రఘు కుంచె కీలక పాత్రలో కనిపించనున్నారు. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి సాగర్ నిర్మాత. అక్టోబర్ 4 నుంచి ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment