ఓటీటీలో 'బిగ్‌ బాస్‌' తెలుగు బ్యూటీ డైరెక్ట్‌ చేసిన సినిమా స్ట్రీమింగ్‌ | Crime Reel Movie Now OTT Streaming | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'బిగ్‌ బాస్‌' తెలుగు బ్యూటీ డైరెక్ట్‌ చేసిన సినిమా స్ట్రీమింగ్‌

Published Sun, Oct 13 2024 12:35 PM | Last Updated on Sun, Oct 13 2024 1:01 PM

Crime Reel Movie Now OTT Streaming

బిగ్‌ బాస్‌ తెలుగుతో గుర్తింపు తెచ్చుకున్న సంజన అన్నే హీరోయిన్‌గా నటించిన 'క్రైమ్‌ రీల్‌' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్‌లోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఇప్పుడు నెట్టింట స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ఈ చిత్రానికి డైరెక్టర్‌ కూడా సంజననే కావడం విశేషం. ఆమె ఇప్పటికే తెలుగులో  'నీకు నాకు పెళ్లంట' అనే సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది. ఆపై 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో సంజ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన విషయం తెలిసిందే.

బిగ్‌బాస్ సీజ‌న్ 2 తర్వాత సంజన అన్నే పెద్దగా కనిపించింది లేదు. అయితే, సోషల్‌మీడియాలో ఆమె ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. అలా సుమారు నాలుగేళ్ల తర్వాత  క్రైమ్ రీల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ పెద్దగా అకట్టుకోలేదు. తాజాగా ఆహా ఓటీటీలో క్రైమ్‌ రీల్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

నేటి సమాజంలో యువత సోష‌ల్ మీడియా వలలో చిక్కుకొని త‌మ జీవితాల‌ను ఎలా నాశ‌నం చేసుకుంటుందో ఒక మంచి సందేశం ఇస్తూ.. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా సంజ‌న న‌టించ‌గా.. సిరి చౌద‌రి,అభి, భ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement