sanjana chowdary
-
ఓటీటీలో 'బిగ్ బాస్' తెలుగు బ్యూటీ డైరెక్ట్ చేసిన సినిమా స్ట్రీమింగ్
బిగ్ బాస్ తెలుగుతో గుర్తింపు తెచ్చుకున్న సంజన అన్నే హీరోయిన్గా నటించిన 'క్రైమ్ రీల్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఇప్పుడు నెట్టింట స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా సంజననే కావడం విశేషం. ఆమె ఇప్పటికే తెలుగులో 'నీకు నాకు పెళ్లంట' అనే సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. ఆపై 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో సంజన ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.బిగ్‌బాస్ సీజన్ 2 తర్వాత సంజన అన్నే పెద్దగా కనిపించింది లేదు. అయితే, సోషల్‌మీడియాలో ఆమె ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. అలా సుమారు నాలుగేళ్ల తర్వాత క్రైమ్ రీల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా అకట్టుకోలేదు. తాజాగా ఆహా ఓటీటీలో క్రైమ్ రీల్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.నేటి సమాజంలో యువత సోషల్ మీడియా వలలో చిక్కుకొని తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటుందో ఒక మంచి సందేశం ఇస్తూ.. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా సంజన నటించగా.. సిరి చౌదరి,అభి, భరత్ కీలక పాత్రల్లో నటించారు. -
సంజయ్ వర్మ.. కథ మొదలైంది
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కథ మొదలైంది’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సంజయ్ వర్మ హీరోగా, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టి. రమేష్ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తమటం కుమార్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు సురేష్ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సంజయ్‌కి కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి’’ అన్నారు. ‘‘ఒక చిన్న విరామం, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రాల్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు తమటం కుమార్ రెడ్డి. ‘‘సమాజంలో జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది చేస్తున్న కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు సాయికృష్ణ కేవీ. -
సిటీ క్వీన్స్ వీరే..
హైదరాబాద్: మిస్ క్వీన్ హైదరాబాద్–2016 పోటీలు గురువారం రాత్రి బేగంపేటలోని ఓ క్లబ్లో నిర్వహించారు. విజేత సంజనా చౌదరి, మొదటి రన్నరప్ అక్షిత(కుడి),రెండో రన్నరప్‌గా షారోన్ ఎన్నికయ్యారు. -
వీహెచ్‌కు ఫోన్లో మహిళ బెదిరింపులు
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుకు ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన శనివారం పోలీసుల్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచొద్దంటూ సంజనా చౌదరి అనే మహిళ ఫోన్లో బెదిరించినట్లు, ఇందిరాగాంధీను చంపించిన సోనియాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ఆమె ఫోన్లో నిలదీసినట్లు ...వీహెచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీకి ఆయన ఫిర్యాదు చేయడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.