
ఓటీటీలో సడెన్‌గా థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సుమారు మూడు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది ఆగష్టులో విడుదలైన 'రేవు' అనే చిన్న సినిమా.. థియేటర్లలో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు.

యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన 'రేవు' గురువారం (నవంబర్ 14) నుంచి తెలుగు ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఒక పోస్టర్‌తో వెళ్లడించారు. 'రేవు: ది బ్యాటిల్ ఫర్ ద సీ' సినిమా మత్స్యకారుల నేపథ్యం చుట్టూ జరగుతుంది. కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులు నటించారు.
కథేంటంటే...
సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్‌లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ?
Comments
Please login to add a commentAdd a comment