ఓటీటీలోకి టీనేజీ ప్రేమకథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Satya Movie 2024 OTT Release Date Details Telugu | Sakshi
Sakshi News home page

Satya Movie OTT: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా

Published Mon, Sep 2 2024 4:08 PM | Last Updated on Mon, Sep 2 2024 4:15 PM

Satya Movie 2024 OTT Release Date Details Telugu

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న రొమాంటిక్ టీనేజ్ లవ్ స్టోరీ మూవీ ఒకటుంది. అదే 'సత్య'. ఇదో తమిళ సినిమా. డబ్బింగ్ చేసి తెలుగులో మే 10న థియేటర్లలో రిలీజ్ చేయగా.. ఓ మాదిరి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్నే దాదాపు నెలల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.

(ఇదీ చదవండి: వివాదంలో 'ఐసీ 814: కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం సమన్లు!)

వినాయక చవితి నుంచి ఆహా ఓటీటీలో 'సత్య' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది. వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులోనే 'సత్య' పేరుతోనే రిలీజ్ చేశారు.

'సత్య' విషయానికొస్తే.. ఇష్టం లేకపోయినా సరే తండ్రి చెప్పడంతో సత్య.. ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ జాయిన్ అవుతాడు. అక్కడే పార్వతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు మనోడు అంటే ఇష్టముంటుంది కానీ బయటపడదు. ఓ రోజు ఊహించని విధంగా సత్యని చెంపదెబ్బ కొడుతుంది. దీంతో అతడు ఆ కాలేజీ వదిలేసి, తన కుటుంబం కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చివరకు ప్రేమకథ కంచికి చేరిందా అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement