Arjuna Phalguna: Aha Announced Sree Vishnu's Movie OTT Release Date, Details Inside - Sakshi
Sakshi News home page

Arjuna Phalguna: అర్జున ఫల్గుణ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Thu, Jan 13 2022 8:35 PM | Last Updated on Fri, Jan 14 2022 10:46 AM

Arjuna Phalguna OTT Release Date Confirmed, Check Inside - Sakshi

Sree Vishnu Arjuna Phalguna In OTT: మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్‌ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. అతడు హీరోగా నటించిన అర్జున ఫల్గుణ సినిమా డిసెంబర్‌ 31న రిలీజైంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ట్రాక్‌ ఎక్కింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ విషయాన్ని ఆహా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 

నరేశ్‌, సుబ్బరాజు, మహేశ్‌, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్‌ సంగీతం అందించాడు. బాక్సాఫీస్‌ దగ్గర అంతంతమాత్రమే ఆడిన అర్జున ఫల్గుణ ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement