
విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు ఈసారి ‘రాజ రాజ చోర’ గా వస్తున్నాడు. శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా శనివారం మోషన్ టీజర్ ద్వారా చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. తదుపరి అవతారం ‘రాజ రాజ చోర’ నమస్సులు అంటూ శ్రీవిష్ణు ట్వీట్ చేయగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను బట్టి చూస్తే.. శ్రీవిష్ణు దొంగగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ సునైన, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ ఇతర తారాగణం. సినిమా కథ అద్భుతంగా ఉంటుందని, ఏప్రిల్ వరకు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నామని నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ చెప్పారు. సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, ఎడిటర్: విప్లవ్ నైషదం. కాగా, శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమా ‘తిప్పరా మీసం’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. హసిత్ గోలీకి ఇది తొలి సినిమా కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment