Sree Vishnu Arjuna Phalguna Movie Release Date Out Now - Sakshi
Sakshi News home page

Arjuna Phalguna: అర్జున ఫల్గుణ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Thu, Dec 16 2021 6:41 PM | Last Updated on Thu, Jan 13 2022 8:23 PM

Sree Vishnu Arjuna Phalguna Movie Release Date Out Now - Sakshi

Arjuna Phalguna Movie Release Date: విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీవిష్ణు. ఇటీవల ఆయన నటించిన 'రాజరాజ చోర' చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 31న మూవీ రిలీజ్‌ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో నరేశ్‌, సుబ్బరాజు, మహేశ్‌, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్‌ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement