
శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అల్లూరి. అల్లూరి సీతారామరాజు అనే పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సోమవారం (జూలై 4న) అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.
ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్.. పోలీస్ బయల్దేరాడురా.. అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి నాంది నిజాయితీ.. నిజాయితీకి మారుపేరు అల్లూరి అన్న డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఒకటిన్నర నిమిషంలోనే తను ఫైర్ మీదున్న పోలీస్ అని, నిజాయితీకి మారుపేరుగా నిలిచే అల్లూరినని చెప్పకనే చెప్పాడు శ్రీ విష్ణు. త్వరలోనే అసలైన ఫైరింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. ఈ సినిమాతో కాయదు లోహర్ తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతోంది.
చదవండి: ఆ తరహా జానర్‌లో తెలుగులో సినిమాలు రాలేదు: డైరెక్టర్
'రుద్రుడు'గా రాఘవ లారెన్స్.. ఆ పండుగకే రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment