వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో హాఫ్ సెంచరీను తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో బాబర్ అర్ధ శతకం సాధించాడు. 65 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. కాగా జట్టు బాధ్యతను తన భుజాన వేసుకుని ఆడిన బాబర్.. దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన స్పిన్నర్ షంసీ బౌలింగ్‌లో ఐదో బంతిని బాబర్ ల్యాప్ స్వీప్ షాట్ ఆడాడు. అయితే ఆ షాట్ ఆడటంలో బాబర్ విఫలమయ్యాడు. బంతి లెగ్ స్టంప్‌ను మిస్స్ అవుతూ వికెట్ కీపర్ డికాక్ చేతికి వెళ్లింది. అదే విధంగా బంతి బ్యాట్‌కు దగ్గరగా కూడా వెళ్లున్నట్లు అన్పించింది. దీంతో డికాక్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు.
కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. డికాక్ అప్పీల్‌లో అంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆఖరి సెకెండ్‌లో రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లేలో బాబర్ చేతి గ్లావ్‌కు బంతి తాకినట్లు తేలింది.
దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా ప్రకటించాడు. అయితే బాబర్ మాత్రం నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Virat Kohli: విరాట్ మాంసం అస్సలు తినడు.. వాళ్లు మాత్రం అవే తింటారు! కోహ్లి డైట్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment