
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కొంతమందితోనైనా నోర్లు మూయించామని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పేర్కొన్నాడు. పాక్ తప్పక గెలవాల్సిన సమిష్టింగా పోరాడి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థర్.. తమను విమర్శించిన వాళ్లకు ఇదొక హెచ్చరిక అని వ్యాఖ్యానించాడు.
‘ మా ఆటగాళ్లు ఆడతారని నాకు తెలుసు.వారు తిరిగి గాడిలో పడడంతో రాణించారు. గతవారం టీమిండియాతో ఓటమి కారుణంగా వారిపై అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో ప్రస్తుతం కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ఈ విజయంతో తమ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయన్నాడు. తాము తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉందని, వాటిలో కచ్చితంగా గెలుస్తామన్నాడు. మిగతా అన్ని జట్లలాగే తమ జట్టు కూడా బలంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment