పాక్‌ బ్యాటర్లకు చుక్కలు.. అరంగేట్రంలోనే నిప్పులు చెరిగిన పేసర్‌ | SA vs Pak 1st Test: Paterson Fifer Debutant Bosch 4 Wickets Pak 211 All out | Sakshi
Sakshi News home page

పాక్‌ బ్యాటర్లకు చుక్కలు.. అరంగేట్రంలోనే నిప్పులు చెరిగిన పేసర్‌

Published Thu, Dec 26 2024 8:40 PM | Last Updated on Thu, Dec 26 2024 8:53 PM

SA vs Pak 1st Test: Paterson Fifer Debutant Bosch 4 Wickets Pak 211 All out

పాకిస్తాన్‌తో మొదటి టెస్టులో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డేన్‌ పాటర్స(Dane Paterson)న్‌తో కలిసి అరంగేట్ర పేసర్‌ కార్బిన్‌ బాష్‌(Corbin Bosch) పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి దెబ్బకు పాక్‌ బ్యాటింగ్‌ఆర్డర్‌ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 211 పరుగులకే ఆలౌట్‌ అయింది.

కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లిన పాకిస్తాన్‌.. పరిమిత ఓవర్ల సిరీస్‌లో మిశ్రమ ఫలితాలు అందుకుంది. టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు 0-2తో కోల్పోయినా.. వన్డే సిరీస్‌లో మాత్రం 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది.

టాపార్డర్‌ కుదేలు
ఈ క్రమంలో సౌతాఫ్రికా- పాకిస్తాన్‌(South Africa vs Pakistan) మధ్య సెంచూరియన్‌లో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు.. షాన్‌ మసూద్‌ బృందాన్ని బ్యాటింగ్‌ ఆహ్వానించింది.

ఆది నుంచే సౌతాఫ్రికా పేసర్లు విజృంభించడంతో పాక్‌ టాపార్డర్‌ కకావికలమైంది. ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌(14), వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం(4)ను పెవిలియన్‌కు పంపి పాటర్సన్‌ శుభారంభం అందించాడు.

రాణించిన కమ్రాన్‌ గులామ్‌
మరో ఓపెనర్‌, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌(17)ను అవుట్‌ చేసిన కార్బిన్‌ బోష్‌.. సౌద్‌ షకీల్‌(14), అమీర్‌ జమాల్‌(28), నసీం షా(0)లను కూడా వెనక్కి పంపించాడు. మరోవైపు.. టాపార్డర్‌లో రెండు కీలక వికెట్లు తీసిన డేన్‌ పాటర్సన్‌.. డేంజరస్‌గా మారుతున్న కమ్రాన్‌ గులామ్‌(54)కు కూడా చెక్‌ పెట్టాడు. అదే విధంగా.. వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(27), సల్మాన్‌ ఆఘా(18) వికెట్లు కూడా కూల్చాడు.

 డేన్‌ పాటర్సన్‌

పాటర్సన్‌ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్‌ రికార్డు సమం
ఈ క్రమంలో డేన్‌ పాటర్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా తరఫున 35 వయస్సులో.. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించి.. రెగ్గీ స్వార్జ్‌(1910- 1912), గాఫ్‌ చబ్‌(1951)ల రికార్డును సమం చేశాడు.

కార్బిన్‌ బాష్‌ అరుదైన ఘనత
మరోవైపు.. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన 30 ఏళ్ల కార్బిన్‌ బాష్‌ కూడా ఓ అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్‌లో మొట్టమొదటి టెస్టులో తొలి బంతికే వికెట్‌ తీసిన ఐదో సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. షాన్‌ మసూద్‌ను అవుట్‌ చేయడం ద్వారా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. అంతకు ముందు.. హర్దూస్‌ విల్‌జోన్‌, డేన్‌ పెట్‌, బెర్ట్‌ వోగ్లర్‌, షెపో మోరేకీ సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించారు.

పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో డేన్‌ పాటర్సన్‌ ఐదు వికెట్లు కూల్చగా.. కార్బిన్‌ బోష్‌ నాలుగు, మార్కో జాన్సెన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. పాక్‌ బ్యాటర్లలో కమ్రాన్‌ గులామ్‌(54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

చదవండి: గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్‌: రోహిత్‌ శర్మ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement