స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన సౌతాఫ్రికా(South Africa).. ఇప్పుడు అదే జట్టుతో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ తుది జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఐడెన్ మార్క్రామ్ బెస్ట్ ఫ్రెండ్ కార్బిన్ బాష్ దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. బాష్ ఇటీవలే పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు.
కాగా దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్ చాలా కీలకం. ప్రోటీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు. సౌతాఫ్రికా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.
తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment