ఎన్‌వీడియా టైటన్‌ ఆర్‌టీఎక్స్‌ | Nvidia Titan RTX, Turing-Based GPU for AI Research, With 24GB GDDR6 RAM Launched in India at Rs. 2,24,000 | Sakshi
Sakshi News home page

ఎన్‌వీడియా టైటన్‌ ఆర్‌టీఎక్స్‌

Published Wed, Dec 5 2018 2:02 PM | Last Updated on Wed, Dec 5 2018 2:02 PM

Nvidia Titan RTX, Turing-Based GPU for AI Research, With 24GB GDDR6 RAM Launched in India at Rs. 2,24,000 - Sakshi

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ కార్డుల తయారీ సంస్థ ఎన్‌వీడియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డెస్క్‌టాప్‌ గ్రాఫిక్ కార్డ్‌ను తాజాగా విడుదల చేసింది. ఎన్‌వీడియా టైటాన్ ఆర్‌టీఎక్స్ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. ఇందులో వినియోగదారులకు 24 జీబీ హైస్పీడ్ జీడీడీఆర్6 గ్రాఫిక్స్ మెమొరీ లభిస్తుంది. 672 జీబీ పర్ సెకండ్ స్పీడ్‌తో ఈ గ్రాఫిక్ కార్డ్ పనిచేస్తుంది. దీని వల్ల అద్భుతమైన గ్రాఫిక్స్‌ను పొందవచ్చు. రియల్ టైం 8కె వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఈ గ్రాఫిక్ కార్డ్ ధర 2499 అమెరికన్ డాలర్లు (దాదాపుగా రూ.1,75,965)గా ఉంది. జనవరి నెలలో అమెరికా, యూరప్ మార్కెట్‌లలో ఈ గ్రాఫిక్ కార్డు విక్రయానికి రానుంది. అయితే ఇండియన్‌ మార్కెట్‌లో దీని ధర 2 లక్షల రూపాయలకు పైమాటే.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement