India Vs Bangladesh 2nd Test: Ravichandran Ashwin Breaks 34-Year-Old World Record In Test Cricket - Sakshi
Sakshi News home page

IND vs BAN: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. 34 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

Published Sun, Dec 25 2022 11:18 PM | Last Updated on Mon, Dec 26 2022 8:28 AM

R Ashwin breaks 34 year old world record in Test cricket - Sakshi

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే భారత్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో వెటరన్‌ ఆటగాడు రవిచంద్ర అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల స్వల్ప  లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 74 పరుగులకే 7 వికెట్లు ‍కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ (42 నాటౌట్‌) అయ్యర్‌తో కలిసి భారత జట్టుకు అద్భుతమైన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అశ్విన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో  విజయవంతమైన ఛేజింగ్‌లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అశ్విన్‌ నిలిచాడు.

అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు విన్స్టన్ బెంజమిన్ పేరిట ఉండేది. 1988లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంజమిన్‌ 40 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌తో 34 ఏళ్ల బెంజమిన్‌ రికార్డును అశ్విన్‌ బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
చదవండి: WTC 2021-23: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement