ఛత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ జిల్లాలో 17వేల మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు.
మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి.
ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది.
Comments
Please login to add a commentAdd a comment