సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించారు. సాహస క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎవరెస్టును అధిరోహించేందుకు ప్రభుత్వం 19 మందిని ఎంపిక చేసింది. అందులో 13 మంది నాలుగు రోజుల క్రితం ఎవరెస్టు ఎక్కగా.. తాజాగా విజయనగరం జిల్లా భద్రగిరిలో ని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న బొడ్ల సాగర్, శ్రీశైలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న శీలం ఈశ్వరయ్య, యువ జన సంక్షేమ విభాగం నుంచి ధర్మతేజ, చెన్నారావు ఈ ఘనత సాధించారు.