లంకెబిందెలున్నాయంటే పలుగు పారతో పరుగెత్తుకెళ్లి తవ్వుతాడు. కొండ కోనల్లో నిధి ఉందని తెలిస్తే టక్కరిదొంగలా సాహసం చేస్తాడు. డబ్బుకోసం మనిషి ఏదైనా చేస్తాడు! మనిషికి అంత ఆశ. దీనిని ఆసరాగా చేసుకుని డబ్లిన్‌లో ఆస్క్ ఎఫ్‌ఎం 2.0 అనే స్టార్టప్ కంపెనీ ఆ ఆశకు గాలం వేసింది. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం లోపల దాదాపు రూ.34 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీ దాచేసింది. సాహసం చేసి తీసుకొచ్చిన వారు ఆ మొత్తాన్ని తమ వెంట తీసుకెళ్లవచ్చని ప్రకటించింది.
ముగ్గురు ఉక్రెయిన్ పర్వతారోహకులు వాటిని సొంతం చేసుకునేందుకు పర్వతాన్ని ఎక్కారు. అయితే అందులో ఇద్దరు మాత్రమే ఆ కరెన్సీని తీసుకొచ్చారు. డబ్బునూ సొంతం చేసుకున్నారు. అయితే మూడో వ్యక్తి ఆ కరెన్సీ అన్వేషణలో ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యాపారంలో భాగంగా క్రిప్టోకరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే ఆ కంపెనీ ఈ పని చేసింది.
ఎవరెస్ట్ కలుగులో ‘డబ్బులు’
Published Sun, Jun 10 2018 12:28 PM | Last Updated on Sun, Jun 10 2018 4:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment